
ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల జాబితాలో భారీ మొత్తంలో అవకతవకలు చోటుచేసుకు న్నాయని ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం ఆరోపించారు. మహోబా జిల్లాలోని ఒకే ఒక ఇంటి నంబర్‌తో 4,271 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. లక్నోలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహోబా జిల్లాలోని రెండు ఇళ్లలో 243, 185 ఉన్నట్లు కనుగొని షాకయ్యా.
తాజాగా, ఒకే ఇంట్లో 4,271 మంది ఓటర్లున్నారు. అంటే ఆ కుటుంబంలోని మొత్తం సభ్యులు కనీసం 12 వేల మంది ఉండి ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే గ్రామంలో మొత్తం ఓటర్లు సుమారు 16 వేలు కావడం మరింత తీవ్రమైన అంశమన్నారు. బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి యూపీలో ఓట్ల చోరీ మొదలుపెట్టాయన్నారు. అదేవిధంగా, బిహార్‌లో బీజేపీ–జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా సంజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలోని భాగల్పూర్‌లో పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు ఎకరా కేవలం రూ.1కే ఏకంగా వెయ్యి ఎకరాల భూమిని పవర్ ప్లాంట్ కోసం 25 ఏళ్లకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఈప్లాంట్ విద్యుత్‌ను యూనిట్ రూ.7 చొప్పున 25 ఏళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు.