
బహరాయిచ్: ఉత్తరప్రదేశ్ బహరాయిచ్‌లో తోడేళ్లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం సాయంత్రం కైసర్‌గంజ్ ప్రాంతంలోని ఓ మగ తోడేలు కదలికలను గుర్తించారు. లభ్యమైన తోడేలు కళేబరం.. నరభక్షక తోడేలుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ధ్రువీకరించగమంటూ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెల్లడించారు.
ఇటీవల గ్రామాల్లో తోడేళ్ల దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే తోడేళ్ల దాడుల్లో నలుగురు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో స్థానికులపై తోడేళ్ల దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో తోడేళ్ల బెడదను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌లో గత ఏడాది నుంచి నరభక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు గతంలో అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మళ్లీ ఆదివారం( సెప్టెంబర్ 29) సాయంత్రం తోడేలు కదలికలను గుర్తించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు గతంలో ఆరు తోడేళ్లను పట్టుకున్నారు.