Bahraich
-
బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
తోడేళ్ల హైజంప్ వేట!
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.బహ్రాయిచ్ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం -
ఆగని తోడేళ్ల దాడులు.. మేకను నోట కరచుకుని..
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. నాన్పరా తహసీల్ పరిధిలో ఒక ఇంటి బయట కట్టిన మేకను తోడేళ్లు చంపుకుతిన్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దానిలో తోడేళ్లు మేకను తమ నోట కరచుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాంస భక్షక తోడేళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఇప్పటి వరకు చాలా తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, తోడేళ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా బహ్రాయిచ్‌లోని బీజేపీ శాసనమండలి సభ్యుడు పద్మాసేన్ చౌదరి ఫామ్‌హౌస్‌లో నాలుగు తోడేళ్ల గుంపు కనిపించింది. వీటిలో ఒక కుంటి తోడేలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెతుకుతున్న తోడేలు ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తోడేళ్ల గుంపు స్థానికులను మరింతగా భయపెడుతోంది.ఆరు తోడేళ్ళ గుంపు మనుషులపై దాడి చేస్తున్నదని గుర్తించిన అటవీశాఖ అధికారులు అతికష్టం మీద ఐదు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా ఒక తోడేలు మిగిలివుందని చెబుతున్నారు. కాగా ఆ తోడేళ్ల గుంపు నరమాంస భక్షకులుగా మారడానికి కారణమేమిటన్నది పరిశోధించాల్సిన అంశమని అటవీ అధికారి తెలిపారు. తాజాగా తోడేళ్లు కనిపించిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ.. -
13 ఏళ్ల బాలునిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అటవీశాఖ అధికారులు ఐదవ తోడేలును పట్టుకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ఆరవ తోడేలు ఆహారం కోసం నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాధిత బాలునికి బహ్రాయిచ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.అటవీ శాఖ అన్ని రకాలుగా తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహసీ ప్రాంతంలో తోడేళ్ల దాడుల కారణంగా సుమారు 110 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహసీ, శివపూర్‌లోని 110 గ్రామాల్లో అటవీశాఖ, పోలీసులు, పీఎస్సీ సిబ్బంది, జిల్లా ఉద్యోగులు వంతుల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు.బహ్రాయిచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. తోడేళ్లు ఇప్పటివరకు 60 మందిని గాయపరిచాయి. ఆరు తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించామని, వాటిలో ఐదు తోడేళ్లను పట్టుకున్నామని అటవీ శాఖ పేర్కొంది. ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలి ఉందని, దానిని పట్టుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే అటవీ శాఖ సమాధానానికి గ్రామస్తులు సంతృప్తి చెందడం లేదు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు? -
ఆగని తోడేళ్ల దాడులు.. వృద్ధురాలి గొంతు కొరికి..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ఐదు తోడేళ్లను పట్టుకున్న తర్వాత కూడా నరమాంస భక్షక తోడేళ్ల బెడదకు అడ్డుకట్టపడలేదు. మంగళవారం రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో బాలికలపై దాడి చేసిన తోడేళ్లు బుధవారం రాత్రి కూడా ఒక వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు నిద్రిస్తుండగా, ఇంటిలోకి దూరిన తోడేలు ఆమె గొంతుకొరికి, మంచంపై నుంచి కిందికి లాగి పడేసింది. ఈ దాడిలో వృద్దురాలి మెడకు బలమైన గాయమైంది. ఈ దాడి నేపధ్యంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియన్ పూర్వా తప్రా గ్రామంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పుష్పాదేవి అనే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో తోడేలు ఆమెపై దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో ఆమె కోడలు వచ్చి, తోడేలును తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో ఆ తోడేలు పారిపోయింది. బాధితురాలికి తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, ఆ తరువాత బహ్రయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.గత రెండు రోజుల్లో నరమాంస భక్షక తోడేళ్లు దాడి చేయడం ఇది మూడోసారి. ఇలా తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం గురించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ మీడియాకు పలు వివరాలు తెలిపారు. ఆ తోడేళ్లు రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడమో కారణంగా అవి ఇలా ప్రవర్తిస్తున్నాయన్నారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణ అంశమని, గత పదేళ్లలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని అన్నారు. దీనిపై అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. దాడులకు పాల్పడుతున్న తోడేళ్ల నమూనాలను విశ్లేషించడం ద్వారా వాటి దాడుల వెనుకనున్న కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని యాదవ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
Bahraich: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 11 ఏళ్ల బాలికపై..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో బాధిత బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ దాడి అనంతరం స్థానికుల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. బహ్రయిచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ అటవీశాఖ ఐదు తోడేళ్లను పట్టుకుంది. ‘ఆల్ఫా’ అనే తోడేలు కోసం వెదుకులాట సాగిస్తోంది. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని అన్నారు. అంతకుముందు ఆగస్టు 29న అటవీ శాఖ బృందం నాలుగో తోడేలును పట్టుకుంది. గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
బహ్రయిచ్‌లో పట్టుబడిన ఐదో తోడేలు
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. #WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024 -
యూపీలో ఆగని తోడేళ్ల బెడద.. బాలుడిపై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. కనిపిస్తే కాల్చేసేందుకు తుపాకులు పట్టుకుని షూటర్లు తిరుగుతున్నా అవి వెనక్కు తగ్గడం లేదు. తాజాగా గురువారం(సెప్టెంబర్ 5) రాత్రి ఓ తోడేలు పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. కొత్వాలీ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై తోడేలు విరుచుకుపడింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. తోడేళ్ల వరుస దాడులతో భయం గుప్పిట్లో బతుకుతున్న బహ్రెయిచ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా దాడితో మరింత భయాందోళనలకు గురవుతున్నారు. బహ్రెయిచ్‌లో ఇప్పటివరకు జరిగిన తోడేళ్ల దాడుల్లో 8 మంది దాకా మరణించగా 35 మంది గాయప డ్డట్లు తెలుస్తోంది . తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయడానికి షూటర్లను రంగంలోకి దింపింది. అయితే వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరుచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినపుడు మాత్రమే తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిచ్‌లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తోడేళ్లది దాడికి పాల్పడే స్వభావం కాదని నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఇదీచదవండి.. రక్తం మరిగిన తోడేళ్లు -
Bhediya Attack: మళ్లీ రెచ్చిపోయిన తోడేళ్లు.. ముగ్గురికి గాయాలు
కౌశాంబి: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో నరమాంస భక్షక తోడేలు ముగ్గురిపై దాడి చేసింది. వారిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించాక వైద్యులు బాధితులను ఇంటికి పంపించారు. తోడేళ్ల దాడి అనంతరం ఆ ప్రాంతంలోని ఇటుక బట్టీ సమీపంలో మూడు వన్యప్రాణులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు రాత్రిపూట కర్రలు,రాడ్లతో తమ పశువులను, కుటుంబాలను కాపాడుకుంటున్నారు. గ్రామస్తుల అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన కరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెవారి, ఖోజ్వాపూర్ గ్రామాలలో చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం తమ కుటుంబ సభ్యులు పశువుల మేతను కోసేందుకు పొలాలకు వెళ్లారని నెవారి గ్రామానికి చెందిన రాజ్కరణ్పాల్ తెలిపారు. ఆసమయంలో తన రెండున్నరేళ్ల మేనల్లుడు ప్రియాంష్ అక్కడ ఆడుకుంటుండగా, ఒక నక్క పొదల్లోంచి బయటికి వచ్చి, ఆ పిల్లాడి మెడను నోట కరుచుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ చిన్నారి ఏడుపు విన్న మహిళలు గట్టిగా కేకలు పెట్టారు. దీంతో తాను, కొంతమంది గొర్రెల కాపరులు పరిగెత్తి ఆ తోడేలు దగ్గరికి వెళ్లగా, అది తమను చూసి పారిపోయిందన్నారు. ఆ తోడేలు అక్కడి నుంచి పరిగెట్టి మేకలు మేపుతున్న రాందాస్ సరోజ అనే మహిళపై దాడి చేసింది. గ్రామస్తులు దానిని తరిమికొట్టడంతో ఆ తోడేలు ఖోజ్వాపూర్ గ్రామం వైపు పరుగు తీసి, అక్కడ సోనుపాల్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిందని రాజ్కరణ్పాల్ తెలిపారు.నెవారి గ్రామానికి చెందిన ధ్యాన్ సింగ్ గత రెండు రోజులుగా తోడేళ్ల గుంపు తమ గ్రామానికి వస్తున్నదని తెలిపారు. ఏ సమయంలోనైనా తోడేళ్ల గుంపు గ్రామంలోకి వచ్చి పిల్లలు, మేకలు, గేదెలపై దాడి చేస్తుందనే భయం తమను వెంటాడుతున్నదన్నారు. రాత్రివేళ పిల్లలను ఇంటి లోపల పడుకోబెట్టి, తాము తోడేళ్ల నుంచి వారిని రక్షించడానికి రాత్రంతా కాపలాగా ఉంటున్నామన్నారు. అటవీశాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో తామే తమ కుటుంబాన్ని, పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. -
తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు. అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు. -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్‌వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్‌లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్‌కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్‌లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్‌లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బహ్రాయిచ్‌లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
భర్త శవంతో పాటు భార్యను...
లక్నో: భర్త శవంతో పాటు భార్యను బస్సులోంచి దారి మధ్యలో దించేసిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి రాజు మిశ్రా(37), అతడి భార్య బహ్రాయిక్ నుంచి లక్నో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. మార్గ మధ్యలో బారబాంకి సమీపంలో రాజుకు గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం అందకపోవడంలో బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే భర్త శవంతో పాటు తన మరదలిని బలవంతంగా బస్సు నుంచి కండక్టర్ సల్మాన్, డ్రైవర్ జునైద్ అహ్మద్ దించేశారని రాజు అన్నయ్య మురళి మిశ్రా ఆరోపించారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఆమె దగ్గర నుంచి టికెట్లు కూడా లాక్కునిపోయారని చెప్పారు. ఈ ఆరోపణలను కండక్టర్, డ్రైవర్ తోసిపుచ్చారు. రాజుకు గుండెపోటు రావడంతో బస్సులో ఉన్న డాక్టర్ ఒకరు పరీక్షించారని, తన వల్ల కాదని ఆయన చెప్పడంతో రామ్‌నగర్‌లోని ప్రైవేటు వైద్యుడు డీపీ సింగ్‌కు చూపించగా రాజు మరణించినట్టు నిర్ధారించారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించేందుకు 100 నంబరుకు ఫోన్ చేసినా స్పందన రాలేదన్నారు. రామ్‌నగర్ స్టేషన్ ఆఫీసర్ శ్యామ్ నారాయణ్ పాండేకు ఫోన్ చేయగా.. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలని సూచించినట్టు చెప్పారు. రాజు భార్య తన బంధువులకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత భర్త మృతదేహంతో బస్సు దిగిపోయిందని తెలిపారు. అక్కడికి పోలీసులను పంపి మృతదేహాన్ని బారబాంకీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు స్టేషన్ ఆఫీసర్ నారాయణ్ పాండే వెల్లడించారు. రాజు మృతదేహానికి వైద్యులు గురువారం పోస్టుమార్టం నిర్వహించారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. -
మోదీని విమర్శించే సత్తా ఒక్క ఆమెదే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇతర వెనకబడిన వర్గాల వారిని వెనకబడిన వారు, ఎక్కువ వెనకబడిన వారని, షెడ్యూల్డ్ కులాల వారిని దళితులు, అతి దళితులని విభజించడం నాకు ఇష్టం లేదు. మనల్ని విభజించడం ద్వారా ఓట్లు వస్తాయని వారు భావిస్తారు. ఇదీ విభజించు, పాలించు విధానమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన పాలకులు చేస్తున్నది ఇదే. మనల్ని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలిపితే వీరు విడదీస్తున్నారు’ అంటూ ఓ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇతర వెనకబడిన వర్గాలను ఉప కేటగిరీలుగా విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 27వ తేదీన చేసిన వ్యాఖ్యలను ఇది సమూలంగా వ్యతిరేకించడమే, సంపూర్ణంగా విమర్శించడమే! ఆమె మరెవరో కాదు, సాధ్వీ సావిత్రి భాయ్ ఫూలే. ఆమె, ప్రజల అభివృద్ధి ఏమాత్రం పట్టించు కోకుండా శతాబ్దాల క్రితం మసీదులుగా మారిన దేవాలయాలను పునరుద్ధరించాలంటూ కషాయం కక్కే సాధ్వీ రితంబర, ఉమా భారతిల కోవకు చెందిన వారు కానేకాదు. వారిలాగా కాషాయం దుస్తులు ధరిస్తారు అంతే! అమె తన ఢిల్లీలోని ఉత్తర అవెన్యూలోని 65 నెంబర్ ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని అణు క్షణం బహుజనుల (దళితులు, మైనారిటీలు, ఓబీసీలు) అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. వారి నుంచి వచ్చే పిటిషన్లను తీసికోవడం, వాటి గురించి వారితో చర్చించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును సావిత్రి భాయ్ ఫూలే నేరుగా ప్రస్థావించకపోవచ్చుగానీ సమయం వచ్చినప్పుడల్లా మోదీ విధానాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టాన్ని గత మార్చి నెలలో సుప్రీం కోర్టు సడలించినప్పటి నుంచి రోజూ ఏదో రూపంలో సాధ్వీ పేరు వినిపిస్తూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పును వెనక్కి తీసుకునేలా చేయాలని ఆమె కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఏప్రిల్ రెండవ తేదీన భారత్ బంద్ నిర్వహించిన దళితులను జైల్లో పెట్టడాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. దళితులకు తమ హక్కుల కోసం పోరాడే నైతిక స్థైర్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల విధానాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. నకిలీ సర్టిఫికెట్లతో దళితేతరులు ఉద్యోగాలు పొందుతున్న రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దళితులను పిలిచి మీ ఇళ్లలోనే భోజనాలు పెట్టండి! నరేంద్ర మోదీ ఆదేశం మేరకు దళితుల ఇళ్లలో భోజనం చేసిన బీజేపీ ఎంపీలను కూడా ఆమె ఎండగట్టారు.‘దళితుల ఇళ్లలో వండిన భోజన పదార్థాలను వాళ్లు తినలేదు. వారు కనీసం మన పాత్రలను ఉపయోగించలేదు. మన గ్లాసుల్లో నీళ్లు తాగలేదు. మన ఇళ్ల బయట దళితేతరుల వంటకాలను వాళ్లు భుజించారు. దీన్నిబట్టి దళితులు అంటరాని వారన్న ఆలోచన వారి నుంచి పోలేదన్నది స్పష్టం అవుతోంది. వారు దళితుల ఇళ్లలో ‘ఇలా’ భోజనం చేసినప్పుడు ఫొటోలు దిగుతారు. అవి వివిధ మీడియాల్లో వైరల్ అవుతాయి. వారు ఇతర కులాలతో కలసి భోజనం చేసినప్పుడు వారు ఇలా ఫొటోలు ఎందుకు దిగరు? వాటికంత ప్రాధాన్యత లేదా?’ అంటూ ఇంతకాలం దళితుల ఇండ్లలో రాజకీయ నాయకుల భోజనాలు అంటు జరుగున్న నాటకాన్ని ఆమె చాలా తెలివిగా బట్టబయలు చేశారు. ‘ఇక నుంచి దళితుల ఇళ్లకెళ్లి భోజనాలు చేయడం కాదు, వారిని తమ ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టండి’ అంటూ బీజేపీ ఎంపీలు సహా రాజకీయ నాయకులందరికి సాధ్వీ సరికొత్త సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ నెలలో అంబేడ్కర్ విగ్రహాన్ని దుండగులను ధ్వంసం చేసినప్పుడు ఆమె ధర్నా చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ను కలుసుకొని దోషులను అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నేటికి కూడా వారిని అరెస్ట్ చేయలేదంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో మొహమ్మద్ అలీ జిన్నా ఫొటో ఉండడాన్ని హిందూ సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు సాధ్వీ అంతే తీవ్రంగా వారిని వ్యతిరేకించారు. ఇతర స్వాతంత్య్ర యోధుల్లాగా జిన్నా కూడా దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం జరిపారని, అలాంటి వ్యక్తి ఫొటో యూనివర్శిటీలో ఉంటే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. పలువురు బీజేపీ ఎంపీలకు తమ కుటుంబాల బాగోగులు చూసుకోవడానికే సమయం చాలడం లేదని ఓ సందర్భంలో ఆమె విమర్శించారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? అటు మోదీ విధానాలకు వ్యతిరేకంగాగానీ, ఇటు బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగానీ నిర్మొహమాటంగా మాట్లాడే ధైర్యం ఆమెకు ఎలా వచ్చింది? ఇందుకు ఆమె పుట్టి పెరిగిన వాతావరణంగానీ, దళితుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నానంటూ ఆమె చేసిన ప్రతిజ్ఞ వల్లగానీ వచ్చి ఉంటుంది. ఆమెనే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాల మేరకు సాధ్వీకి ఆరవ ఏటనే పెళ్లయింది. తనకు మొగుడు వద్దని, చదుకుంటానని పంతం పట్టింది. ఎనిమిదవ తరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయింది. ఎస్సీ విద్యార్థులకిచ్చే స్కాలర్షిప్ను తనుకూ ఇవ్వాలని ఆమె తన ప్రిన్సిపాల్‌ను డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించిన ప్రిన్సిపల్ తాను సరిగ్గా బోధించడం వల్లనే ఫస్ట్‌క్లాస్ వచ్చిందని వాదించారు. ‘నేను చదువుకోవడం వల్లనే నాకు ఫస్ట్ వచ్చింది’ అంటూ వాదించిన సాధ్వీ తనకు టీసీ ఇవ్వాలని, మరో స్కూల్లో చదువుకుంటానని ప్రిన్సిపల్‌ను కోరింది. అందుకు కూడా ప్రిన్సిపాల్ నిరాకరించడంతో ఆమె మూడేళ్లపాటు స్కూల్‌కే పోలేదు. మాయావతిని కలుసుకున్న వేళ 1995లో మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజాదర్బార్‌లో ఆమెను సాధ్వీ కలుసుకున్నారు. ఆ సందర్భంగా తన స్కూల్ విషయం చెప్పారు. మాయావతి సూచన మేరకు ఆమె జిల్లా కలెక్టర్‌ను కలుసుకొని స్కూల్ నుంచి టీసీ, సర్టిఫకేట్ తెప్పించుకున్నారు. మళ్లీ చదువు ప్రారంభించారు. ‘మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు నేనెందుకు కాకూడదు!’ అని నాడే ఆమె అనుకున్నారట. అప్పుడు ఐదు నెలల కాలంలోనే మాయావతి ప్రభుత్వం రద్దయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. అప్పటికే బీఎస్పీ సభ్యత్వం తీసుకున్న ఆమె లక్నోలో జరిగిన దళితుల ధర్నాలో పాల్గొన్నారు. ఆ ధర్నాపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. అప్పుడు ఓ బుల్లెట్ ఆమె కాలి పిక్కలోని దూసుకుపోయింది. దాంతో ఆమె ఆస్పత్రికి, అటు నుంచి జైలుకు వెళ్లారు. జైల్లో ఉండగానే తనకు మొగుడు, సంసార జీవితం అక్కరలేదని, బహుజన అభ్యున్నతి కోసం కృషి చేయాలని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఇంటి వాళ్లను ఒప్పించి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. దళితుల పక్షాన కృషి చేస్తూనే బీఏ వరకు చదువుకున్నారు. 2000లో బీఎస్పీ నుంచి సస్పెన్షన్ పార్టీ వైఖరిని విమర్శించడం వల్ల 2000 సంవత్సరంలో బీఎస్పీ నుంచి సస్పెండ్ అయ్యారు. బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2012లో పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో బహ్రాయిక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆమె బహుజనుల సమస్యలపైనే పార్టీలో, పార్టీ వెలుపల పోరాటం చేస్తున్నారు. -
భారత సరిహద్దులో బాంబుల కలకలం
బహ్రాయిచ్(యూపీ) : భారత సరిహద్దులో గురువారం బాంబులు దొరకడంతో తీవ్రకలకలం రేగింది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఆరు బాంబులు లభ్యమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని రుపైదియా గ్రామంలో బాంబులున్నట్టు గుర్తించారు. భారత్ నేపాల్ సరిహద్దును పహారా కాసే సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) జవాన్లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యే కుమారుడి కిరాతకం
- ఇద్దరు మైనర్ బాలుర సజీవ సమాధి - తండ్రులు ఎదురుతిరిగినందుకు పిల్లలపై ప్రతీకారం - యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో దారుణం బహ్రెయిచ్: అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకుననే గర్వం.. కిరాతకానికి ఒడిగట్టేలా చేసింది. ఇద్దరు మైనర్ బాలురను సజీవసమాధిచేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకుతోపాటు ఇసుక మైనింగ్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లా భౌరీ అనే గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. భౌరీ గ్రామానికి చెందిన దళిత బాలురు కరణ్(10), నిస్సార్(11) బుధవారం నుంచి కనిపించకుండా పోయారు. రోజంతా వెతికినా పిల్లలు కనిపించకపోవడంతో తండ్రి చేత్రామ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గురువారం నాటికి గాలింపు చర్యను ముమ్మరం చేయగా.. గ్రామాన్ని ఆనుకునే ప్రవహించే ఘంఘారా నది వద్ద నిసార్ మృతదేహం కనిపించింది. దానికి కొద్ది దూరంలోనే కరణ్‌ను ఇసుకలో పాతిపెట్టినట్లు గుర్తించారు. శవాలు దొరికిన ప్రాంతంలోనే ఇసుక మాఫియా ర్యాంప్ ఉంది. దీంతో ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే కొడుకు పనే అయిఉంటుదని గ్రామస్తులు ఆగ్రహించారు. అక్కడి ప్రొక్లెయినర్లు, లారీలను తగులబెట్టారు. కొన్నాళ్లుగా ఘంఘారా నదిలో నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమరవాణా జరుగుతున్నదని, దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ స్థానిక(పయాగ్పూర్) బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ త్రిపాఠినే అనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడైన మనోజ్ శుక్లా పేరు మీద మైనింగ్ లైసెన్స్ తీసుకుని, అనుమతించినదానికంటే పదింతలు ఎక్కువ ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పంటపొలాలు బీడుపడ్డాయి. స్థానిక రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఛేత్రామ్(చనిపోయిన బాలుర తండ్రి), ఇంకొందరు గ్రామస్తులు ఇసుక మాఫియాపై ప్రత్యక్ష పోరుకు దిగారు. పలుమార్లు లారీలను ఆపేసే ప్రయత్నం చేశారు. ఇసుక మాఫియా వ్యవహారమంతా ఎమ్మెల్యే కొడుకు నిషాంక్ త్రిపాఠి పర్యవేక్షిస్తుంటాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ మాట ఒకలా.. పోలీసుల యాక్షన్ మరోలా ఘంఘారా నదిలో ఇసుక మాఫీయా లేదని, మనోజ్ శుక్లా ఎమ్మెల్యే అనుచరుడే అయినప్పటికీ అధికారికంగా లైసెన్స్ పొందాడని బహ్రెయిచ్ కలెక్టర్ తెలిపారు. గతంలో భౌరీ గ్రామానికి చెందినవారే కాంట్రాక్టర్లుగా ఉండేవారని, ఇటీవలే అది ఎమ్మెల్యే అనుచరుడికి దక్కడంతో స్థానికులు కోపంగా ఉన్నారని కలెక్టర్ వివరించారు. గ్రామస్తులు పలుమార్లు ఇసుక తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. అయితే పిల్లలు ఎలా చనిపోయారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని, దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కాగా, కలెక్టర్ వివరణకు భిన్నంగా పోలీసులు.. ఎమ్మెల్యే కొడుకు, మైనింగ్ కాంట్రాక్టర్లపై హత్య కేసు నమోదు చేయడం గమనార్హం. రాజకీయ కుట్రతో ఇరికించారు: ఎమ్మెల్యే త్రిపాఠి తాము ఇసుక అక్రమరవాణా చేయడంలేదని, అధికారికంగానే కాంట్రాక్టులు తీసుకున్నామని ఎమ్మెల్యే సుభాష్ త్రిపాఠి చెప్పుకొచ్చారు. పిల్లల మరణాలకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తమ కుటుంబాన్ని ఇందులో ఇరికించారని ఆరోపించారు. కోవింద్ రావాల్సిందే: ఆజంఖాన్ చనిపోయిన దళిత బాలల దహనసంస్కారాలకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకావాలని సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ డిమాండ్ చేశారు. ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధికారంలోఉన్న ఉత్తరప్రదేశ్‌లో దళితులు, మైనారిటీలకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. -
ల్యాండ్ కాని మోదీ హెలికాప్టర్; ఫోన్లో ప్రసంగం
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం వల్ల ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ల్యాండ్ కాలేకపోయింది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అనుకూలించకపోవడంతో ఫైలట్ లక్నోకు దారి మళ్లించారు. లక్నోలో సురక్షితంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం బహ్రెయిచ్‌లో పరివర్తన్ ర్యాలీలో మోదీ పాల్గొనాల్సివుంది. కాగా ప్రతికూలవాతావరణం కారణంగా ఆయన పర్యటన రద్దయ్యింది. దీంతో మోదీ లక్నో నుంచే ఫోన్ ద్వారా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య తన మొబైల్ ఫోన్‌ను మైకు దగ్గర ఉంచి మోదీ ప్రసంగాన్ని సభికులకు వినిపించారు. -
యూపీలో పడవ బోల్తా: 12 మంది గల్లంతు
ఉత్తరప్రదేశ్‌లోని సరయు నదిలో గత రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. గల్లంతైన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న సమయంలో బాగా చీకటిగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టలేకపోయినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్బంగా టకియా ఘాట్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొని 25 మందితో తిరిగి వస్తున్న పడవ బరిచ సమీపంలో తిరగబడిందని, అయితే సరయు నది ఒడ్డున ఉన్న స్థానికులు వెంటనే స్పందించి13 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారంతా రమశ్యపూర్వ, నారాయణ్‌పూర్, చందన్‌పూర్, సంకల్ప్,గోలక్పూర్ గ్రామాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. -
రూ.50 కోట్ల విలువైన ప్లాటినం విగ్రహాలు స్వాధ్వీనం
ఉత్తరప్రదేశ్‌లో బరిచాలోని దొన్నక్క ప్రాంతంలో ఇద్దరు యువకుల నుంచి నాలుగు ప్లాటినం దేవత విగ్రహలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మోహిత్ గుప్తా శుక్రవారం వెల్లడించారు. నిందితలు అజయ్, రామ్ కిషోర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మరింత సమాచారం కోసం పోలీసులు తమదైన శైలీలో విచారిస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్‌కు నిన్న దొన్నక్క ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకుల నుంచి అత్యంత విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బ్రహ్మ,లక్ష్మీ,గణేష్, నంది ప్లాటినం విగ్రహాలను సీజ్ చేసినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఆ విగ్రహాల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని మోహిత్ గుప్తా తెలిపారు.