రూ.50 కోట్ల విలువైన ప్లాటినం విగ్రహాలు స్వాధ్వీనం | nabbed with platinum idols worth Rs 50 crore | Sakshi
Sakshi News home page

రూ.50 కోట్ల విలువైన ప్లాటినం విగ్రహాలు స్వాధ్వీనం

Oct 11 2013 1:44 PM | Updated on Sep 1 2017 11:34 PM

ఉత్తరప్రదేశ్లో బరిచాలోని దొన్నక్క ప్రాంతంలో ఇద్దరు యువకుల నుంచి నాలుగు ప్లాటినం దేవత విగ్రహలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మోహిత్ గుప్తా వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్లో బరిచాలోని దొన్నక్క ప్రాంతంలో ఇద్దరు యువకుల నుంచి నాలుగు ప్లాటినం దేవత విగ్రహలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మోహిత్ గుప్తా శుక్రవారం వెల్లడించారు. నిందితలు అజయ్, రామ్ కిషోర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మరింత సమాచారం కోసం పోలీసులు తమదైన శైలీలో విచారిస్తున్నట్లు చెప్పారు.

 

గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్కు నిన్న దొన్నక్క ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకుల నుంచి అత్యంత విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బ్రహ్మ,లక్ష్మీ,గణేష్, నంది ప్లాటినం విగ్రహాలను సీజ్ చేసినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఆ విగ్రహాల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని  మోహిత్ గుప్తా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement