అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రెయిన్’. బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయచంద్ర నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వంలో ఎండ్లూరి కళావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మాట్లాడుతూ – ‘‘క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్‌లో ‘ది బ్రెయిన్’ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎల్ రాజా.


