యూపీలో పడవ బోల్తా: 12 మంది గల్లంతు | Boat capsizes in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో పడవ బోల్తా: 12 మంది గల్లంతు

Nov 19 2013 9:58 AM | Updated on Sep 2 2017 12:46 AM

ఉత్తరప్రదేశ్లోని సరయు నదిలో గత రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్లోని సరయు నదిలో గత రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారని పోలీసులు మంగళవారం వెల్లడించారు. గల్లంతైన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న సమయంలో బాగా చీకటిగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టలేకపోయినట్లు వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

 

కార్తీక మాసం సందర్బంగా టకియా ఘాట్లో జరిగిన వేడుకల్లో పాల్గొని 25 మందితో తిరిగి వస్తున్న పడవ బరిచ సమీపంలో తిరగబడిందని, అయితే సరయు నది ఒడ్డున ఉన్న స్థానికులు వెంటనే స్పందించి13 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారంతా రమశ్యపూర్వ, నారాయణ్పూర్, చందన్పూర్, సంకల్ప్,గోలక్పూర్ గ్రామాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement