మరో ప్రైవేటు స్లీపర్‌ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం | Narrow escape for passengers as UP AC sleeper bus catches fir | Sakshi
Sakshi News home page

మరో ప్రైవేటు స్లీపర్‌ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Oct 26 2025 4:12 PM | Updated on Oct 26 2025 5:46 PM

Narrow escape for passengers as UP AC sleeper bus catches fir

లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్‌ డెక్కర్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.  ఆదివారం(అక్టోబర్‌ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్‌ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. 

డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి  ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. టోల్‌ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. 

బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్‌ జగత్‌ సింగ్‌ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు.  ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై చాలా సేపు ట్రాఫిక్‌ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement