
ఫరూఖాబాద్: ప్రైవేట్ జెట్ విమానమొకటి రన్ వే పైనుంచి జారి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా మహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఇద్దరు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జెట్ సర్వీస్ ఏవియేషన్‌కు చెందిన విమానం ఉదయం 10.30 గంటల సమయంలో రన్ వేపై ల్యాండయిన అనంతరం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ఓ బీర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.