breaking news
skids off runway
-
రన్‌వే పైనుంచి జారి పొదల్లోకి...
ఫరూఖాబాద్: ప్రైవేట్ జెట్ విమానమొకటి రన్ వే పైనుంచి జారి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా మహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, ఇద్దరు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జెట్ సర్వీస్ ఏవియేషన్‌కు చెందిన విమానం ఉదయం 10.30 గంటల సమయంలో రన్ వేపై ల్యాండయిన అనంతరం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో జిల్లాలో నిర్మాణం జరుగుతున్న ఓ బీర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
షిర్డీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, ముంబై: స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. షిర్డీ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సందర్భంగా రన్‌వే పై స్కిడ్ అయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఢిల్లీనుంచి షిర్డీకి వస్తున్న సమయంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే మీదనుంచి జారిపోయింది. దాదాపు 30నుంచి 20 మీటర్ల దూరం దూసుకుపోయింది. దీంతో యాత్రికుల తాకిడి అధికంగా వుండే విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం ఉదంతాన్ని స్పైస్ జెట్ ప్రతినిధి నిర్ధారించారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
రన్‌వే నుంచి పక్కకు జారిపోయిన విమానం..
ఇండోర్: ల్యాండ్ అవుతోన్న విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న 66 మంది ప్రయాణికులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండోర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2793 విమానం 66 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చింది. సిమెంట్ సర్ఫేస్ రన్ వేపై ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోయిందని, నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. వాహనాల ద్వారా ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని, తుప్పల్లోకి జారిపోయిన విమానాన్ని ఇంజనీర్లు పరీక్షిస్తున్నారని పేర్కొంది. -
జపాన్ విమానం.. జారిపోయింది!!
పశ్చిమ జపాన్‌లో ఓ విమానం రన్‌వే మీద ల్యాండయిన తర్వాత జర్రున జారిపోయింది. దాంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని జపాన్ అధికార వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఈ కారణంగా హిరోషిమా విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి 74 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 320 విమానం హిరోషిమా విమానాశ్రయానికి చేరుకుంది. తీరా అక్కడ రన్‌వే సరిగా లేకపోవడంతో జర్రున జారిపోయింది. దాంతో ప్రయాణికులను నేరుగా దించేందుకు వీలు కుదరక.. అత్యవసర మార్గాల ద్వారా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటో మాత్రం తెలియలేదు. ల్యాండింగ్ సమయంలో విమానం నేరుగా రన్‌వేను తాకడంతో నిప్పు రవ్వలు ఎగిశాయి. దాంతో అగ్నిమాపక దళానికి కూడా సమాచారం అందించారు. రెండేళ్ల క్రితం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి కూలిపోయి సుమారు 200 మంది మరణించారు.