రన్వే నుంచి పక్కకు జారిపోయిన విమానం.. | Jet Airways Plane With 66 Passengers Skids Off Runway At Indore Airport | Sakshi
Sakshi News home page

రన్వే నుంచి పక్కకు జారిపోయిన విమానం..

May 8 2016 8:35 AM | Updated on Sep 3 2017 11:41 PM

ఇండోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న జెట్ ఎయిర్ వేస్ విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న 66 మంది ప్రయాణికులు..

ఇండోర్: ల్యాండ్ అవుతోన్న విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న 66 మంది ప్రయాణికులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండోర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2793 విమానం 66 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చింది. సిమెంట్ సర్ఫేస్ రన్ వేపై ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోయిందని, నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. వాహనాల ద్వారా ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని, తుప్పల్లోకి జారిపోయిన విమానాన్ని ఇంజనీర్లు పరీక్షిస్తున్నారని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement