breaking news
Indore Airport
-
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్లో పొగలు
న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్ ఫెయిల్ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కువైట్ నుంచి వచ్చిన భారతీయుల్లో కరోనా
భోపాల్ : గతవారం కువైట్ నుంచి ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో 25 మందికి పైగానే కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విద్యార్థులు, పర్యాటకులు సహా 120 మంది భారతీయులు మే13న కువైట్ నుంచి రెండు విమానాల్లో ఇండోర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని భోఫాల్‌లోని క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు. 240 మంది ప్రయాణికుల్లో 25కి పైగానే కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం మరికొంత మందిలో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. (60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) ప్రస్తుతం కరోనా బాధితులు భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 5,000 దాటగా, కరోనా కారణంగా ఒక్క ఇండోర్‌లోనే అత్యధికంగా 249 మంది మరణించారు. ఇప్పుడు ఇండోర్ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల్లో కరోనా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో వారికి చికిత్స అందిస్తున్న సిబ్బందికీ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి ) -
రన్‌వే నుంచి పక్కకు జారిపోయిన విమానం..
ఇండోర్: ల్యాండ్ అవుతోన్న విమానం ఒక్కసారిగా రన్ వే నుంచి పక్కకు జరిపోయింది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న 66 మంది ప్రయాణికులు చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండోర్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9డబ్ల్యూ 2793 విమానం 66 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చింది. సిమెంట్ సర్ఫేస్ రన్ వేపై ల్యాండ్ అవుతుండగా పక్కకు జారిపోయిందని, నలుగురు సిబ్బంది సహా 66 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. వాహనాల ద్వారా ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని, తుప్పల్లోకి జారిపోయిన విమానాన్ని ఇంజనీర్లు పరీక్షిస్తున్నారని పేర్కొంది.