హనీమూన్‌ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది | Man Slaps Accused In Raja Raghuvanshi Case: Video Viral | Sakshi
Sakshi News home page

హనీమూన్‌ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది

Jun 11 2025 2:24 PM | Updated on Jun 11 2025 3:07 PM

Man Slaps Accused In Raja Raghuvanshi Case: Video Viral

ఇండోర్‌ ఎయిర్‌పోర్ట్‌ బయట.. నిందితురాలు సోనమ్‌

ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్‌. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్‌ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం, అలాగే ట్రాన్సిట్‌ వారెంట్‌ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్‌ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. 

ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇండోర్‌ దేవీ అహల్య ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు.  

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్‌ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే  మేఘాలయా హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్‌ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్‌ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్‌రాజ్‌పుత్‌, విశాల్‌ సింగ్‌ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్‌ మీడియాలో నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement