breaking news
Raja Raghuvanshi
-
కనిపించని పశ్చాత్తాపం.. జైలు జీవితం బాగుందంటున్న సోనమ్
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో నిందితురాలు సోనమ్ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్‌తో సోనమ్ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తోంది.నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్‌ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్‌లో లేదు. జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.ఇక సోనమ్‌ను జైలు అధికారులు జైలు వార్డెన్ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్‌ను షేర్ చేసుకుంటున్నారు. సోనమ్ కుట్టుమిషను ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. -
మేఘాలయ హనీమూన్ కేసుపై సినిమా ప్లాన్ చేస్తున్న హీరో!
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ! హత్యోదంతంపై సినిమాఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్‌కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. బలవంతంగా పెళ్లితమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్బుక్ అకౌంట్లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.భర్త అంత్యక్రియల్లో ప్రియుడుఅక్కడి నుంచి ఇండోర్‌కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్‌ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్‌ను సైతం అరెస్టు చేశారు.చదవండి: షాపింగ్‌మాల్‌లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే? -
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ కీలక పురోగతి
షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్ దర్యాప్తులో సోనమ్‌కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్‌లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్ యజమాని ఓ ఇన్ఫ్రాస్టక్చర్ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్. అయితే, సోనమ్ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్‌ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అంతేకాదు, జేమ్స్ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్‌కు ఫోన్ చేశారు. సోనమ్ అద్దెకు ఉన్న ప్లాట్‌లో ఓ బ్యాగ్ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్ ఆ బ్యాగ్‌ను తీయించలేదు. అందుకే తమర్ ఆ బ్యాగ్‌ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఇండోర్‌లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. Just take a look at this wedding video of Sonam and Raja Raghuvanshi and you will agree that Sonam was clearly not happy with this marriage. Raja Raghuvanshi would have been alive if Sonam had said No to the marriage. She had the courage to hire contract killers but didn't had… pic.twitter.com/NbHlQQWzXK— Incognito (@Incognito_qfs) June 9, 2025 -
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
షిల్లాంగ్: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్‌ను తలపిస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్ వచ్చేందుకు సోనమ్ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్ దాటించిన వెహికల్ డ్రైవర్ చెప్పాడు.రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్‌లో సోనమ్ రఘువంశీని ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్,పియూష్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్‌ను పోలీసులు విచారించారు.సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్‌కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు. రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్),పియూష్‌ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
-
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్‌కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్‌ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్‌ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్‌దాంగ్‌ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్‌లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు
-
భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్
-
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్ కపుల్ కేసులో షాకింగ్ ట్విస్ట్
మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చేస్తున్నాయి. వధువు సోనమే ఓ పథకం ప్రకారం తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించిందన్న విషయం ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇందుకుగానూ కిరాయి హంతకులకు ఆమె తొలుత చెప్పిన కంటే రెట్టింపు సొమ్ము ఆఫర్ చేసిందని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. అదే సమయంలో..తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో శారీరకంగా కలవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ ప్రియుడు రాజ్ కుష్వాహాతో జరిపిన చాటింగ్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ‘‘రాజా అంటే నాకు ఇష్టం లేదు. అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగానే ఉంటున్నా. పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా’’ అంటూ ఆమె రాజ్‌తో చాటింగ్ చేసినట్లు అందులో ఉంది. ఇక.. 👉భర్తను కిరాతకంగా హత్య చేయించి.. ఆ మృతదేహాన్నిలోయలో పడేయించిన ఆమె ఆపై కొత్త డ్రామా ఆడింది. రాజా ఫోన్ నుంచి ఏడు జన్మలోనూ నువ్వే నా తోడుగా.. అంటూ క్యాప్షన్ వాట్సాప్ స్టేటస్‌గా ఉంచింది. మే 23వ తేదీన రాజా హత్య జరగ్గా.. కొన్ని గంటల తర్వాత ఆమె ఆ స్టేటస్ ఉంచింది. తద్వారా రాజా బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది.👉పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనమ్ రూ.4లక్షలు ఇవ్వజూపింది. కానీ, తర్వాత ఆ మొత్తాన్ని రూ.20లక్షలకు పెంచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు ఆమె సహకరించిందని పేర్కొన్నాయి. 👉మే 11న రాజా రఘువంశీతో సోనమ్‌కి వివాహం జరగ్గా.. 20న హనీమూన్ (Honeymoon) కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి వారు ఉంటున్న బస నుంచి ఓ స్కూటీపై బయటకు వెళ్లి.. ఆచూకీ లేకుండా పోయారు. ఆ బండి ఓ గ్రామ శివారులో లభ్యమైంది. అయితే.. అదృశ్యమైన 11 రోజుల తర్వాత(జూన్ 2వ తేదీన) రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. సోనమ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంతా కంగారు పడ్డారు. ఈలోపు ఆమె కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో గాలింపును ముమ్మరం చేసి.. మరోవైపు కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. 👉అంతా సోనమ్, కుశ్వాహా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు చేసింది. రఘువంశీ హత్య కేసు విచారణ సమయంలో సోనమ్ బ్రతికే ఉందని గుర్తించాం. దీంతో ఆమె ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా.. ఇలాంటి ఆయుధాన్ని మేఘాలయలో ఉపయోగించరు. దాంతో బయటివ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది. తర్వాత మేం కాల్ రికార్డులను పరిశీలించాం. అందులో రాజ్ కుష్వాహతో ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉంది. సోనమ్ చివరిసారిగా రాజా తల్లితో మాట్లాడిన మాటలు మాకు అనుమానం కలిగించాయి. అలాగే ఆమె ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలేవీ స్టేటస్లు పెట్టకపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి’’ అని పోలీసు అధికారి వెల్లడించారు.👉ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కుష్వాహ మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందౌర్‌కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు రాజ్ కుష్వాహ నడిపాడని వారు వివరించారు. సోనమ్ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్వాహా అలా నటించినట్లు తెలుస్తోంది.👉తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహతో సోనమ్ ప్రేమలో ఉంది. అయితే పెద్దలకు ఆ విషయం చెప్పే ధైర్యం లేక రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. సోనమ్, కుశ్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు. దాన్ని అమలుచేసేందుకు సోనమ్, కుశ్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటుచేసుకొన్నారు. ఈ క్రమంలోనే కుశ్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనమ్‌తో ఫోన్లో టచ్‌లో ఉండి.. తమ ప్రణాళిక అమలయ్యేలా చేశాడు. పథకం ప్రకారం రఘువంశీని సోనమ్ చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకెళ్లింది. అక్కడ కిరాయి రౌడీలు అతడిని హతమార్చారు. అనంతరం సోనమ్‌తో సహా ముగ్గురు నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు విడిపోయారు. అయితే పోలీసుల వద్దకు రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో అపహరించారని సోనమ్ చెప్పడం గమనార్హం. కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహాతో సోనమ్‌కు సాన్నిహిత్యం ఉందని వెల్లడైంది. అతడే ఈ హత్య ప్లాన్‌ను నడిపించాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇండోర్‌కు చెందిన విశాల్‌సింగ్ చౌహాన్ (22), రాజ్‌సింగ్ కుశ్వాహా (21), ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌కు చెందిన ఆకాశ్ రాజ్‌పూత్ (19)ను ఈ కేసులో అరెస్టు చేశారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులందరినీ పోలీసులు మేఘాలయాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆమెను విమానంలో తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.