
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో నిందితురాలు సోనమ్ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.
పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్‌తో సోనమ్ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తోంది.
నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్‌ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్‌లో లేదు.
జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.
ఇక సోనమ్‌ను జైలు అధికారులు జైలు వార్డెన్ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్‌ను షేర్ చేసుకుంటున్నారు. సోనమ్ కుట్టుమిషను ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.