breaking news
Honeymoon couple
-
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్‌లు అప్పటికే..
గౌహతి: మేఘాలయ హనీమూన్ కేసులో లెక్కలేనన్ని ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. భర్త రాజారఘువంశీ హత్యకు కుట్ర పన్నిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు పోలీసుల ముందు మరో నిజాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో తమ మధ్య సంబంధం ఉన్నదని వారు పోలీసుల సమక్షంలో అంగీకరించారని మేఘాలయ పోలీసులు తెలిపారు.తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో రాజ్, సోనమ్‌లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. వారిద్దిరూ ఇప్పటికే నేరాన్ని అంగీకరించారని, తాము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా, దానికి వారు సహకరిస్తూ, అన్ని ఆధారాలు చూపించారన్నారు. అందుకే సోనమ్‌కు ఇప్పుడు నార్కో టెస్టులు అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.సాధారణంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కానప్పుడే నార్కో పరీక్ష జరుగుతుందని, వాస్తవానికి సుప్రీంకోర్టు నార్కో విశ్లేషణను నిషేధించిందని వివేక్ సయీమ్ తెలిపారు. కేవలం వారి ఒప్పుకోలును మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, బలమైన సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. చార్జిషీట్‌ను వీలైనంత త్వరగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రఘువంశీ హత్యకు డబ్బు ప్రధాన కారణం కాదని, వారి సంబంధానికి అతను అడ్డుకాకూడదని వారు భావించివుండవచ్చునన్నారు.మేఘాలయ పోలీసులు తాజాగా ఇండోర్‌లోని ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్‌ను విచారణ కోసం రప్పిస్తున్నారు. సోనమ్‌ను అరెస్టు చేయడానికి ముందు ఆమె భర్తతో పాటు అతని ప్లాట్‌లో కొంతకాలం ఉన్నారు. కాగా సోనమ్ బ్యాగ్‌లో ఒక దేశీయ పిస్టల్, ఫోన్, రాజా రఘువంశీకి చెందిన నగలు, రూ ఐదు లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి విచారణలో కీలకంగా మారనున్నాయని అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్‌కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్‌కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీలో మరో హనీమూన్ మర్డర్..?
-
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
-
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్‌కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్‌ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్‌ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్‌దాంగ్‌ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్‌లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్‌తో పాటు ప్రియుడు..
షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్‌ల హనీమూన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్‌ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్‌లో ఉండగా, ఒక పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్ యూపీలోని ఘాజీపూర్‌లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్‌ను మేఘాలయ తీసుకువచ్చారు.మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.ఇది కూడా చదవండి: అంబులెన్స్‌లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’ -
హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు
-
హనీమూన్ హత్య కేసు: కట్టలు తెంచుకున్న కోపం.. చెంప పగిలింది
ఇష్టం లేని వివాహం చేశారని.. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ పక్కా స్కెచ్‌తో ప్రాణం తీసింది సోనమ్. ఒకవేళ కిరాయి హంతకుల చేతిలో గనుక మిస్ అయితే తానే అతన్ని లోయలోకి తోసేసి ప్రాణం తీసేద్దామని అనకుందట!. ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం, అలాగే ట్రాన్సిట్ వారెంట్ మీద నలుగురు నిందితులను మంగళవారం రాత్రి మద్యప్రదేశ్ పోలీసులు మేఘాలయాకు తరలించారు. అయితే.. ఆ టైంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండోర్ దేవీ అహల్య ఎయిర్పోర్ట్ నుంచి నిందితులను విమానంలో షిల్లాంగ్‌కు తరలించారు. ఆ సమయంలో ఓ పెద్దాయన బయట లగేజీతో ఎదురు చూస్తున్నాడు. ఏమైందో ఏమోగానీ.. వాళ్లు దగ్గరికి రాగానే హంతకుల్లో ఒకడి చెంప చెల్లుమనిపించాడు. నలుగురికి ముసుగులు వేసి ఉండడంతో ఎవరి చెంప పగిలిందనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే అధికారులు ఆ పెద్దాయనను ఏమనకుండా.. నిందితులను వేగంగా లోపలికి తీసుకెళ్లారు. Indore, Madhya Pradesh: At the Indore Airport, a passenger slapped one of the four accused in the Raja Raghuvanshi murder case, who were being escorted by Shillong Police and Indore Crime Branch for a flight to Shillong on transit remand pic.twitter.com/evB5ppJ2I8— IANS (@ians_india) June 10, 2025మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్‌కు మే 11వ తేదీన వివాహం జరిగింది. మే 20వ తేదీన ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది. మూడు రోజుల తర్వాత బస నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే మేఘాలయా హనీమూన్ జంట మిస్సింగ్ కేసు తొలుత పెద్దగా వార్తల్లో నిలవలేదు. కానీ, ఎప్పుడైతే నవ వధువు సోనమ్ తన భర్తను ప్రియుడు, కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించిందని తెలిసిందో .. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. రాజ్‌సింగ్ కుష్వాహా ఆమె ప్రియుడు కాగా, ఆకాశ్రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన, ఆనంద్‌లు సుపారీ హంతకులుగా ఈ హత్యలోభాగం అయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. -
భర్త రాజా రఘువంశీని హత్య చేయించిన భార్య సోనమ్
-
ఇబ్బందిగా ఉన్నా నా భర్త సర్దుకుపోతాడు: కీర్తీ సురేష్
సౌత్ ఇండియా నటి కీర్తీ సురేష్(Keerthy Suresh) చాలా లక్కీ అనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేయడం వల్లో ఏమోగానీ, కథానాయకిగానూ చాలా త్వరగా క్లిక్ అయ్యారు. అదేవిధంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ వెనువెంటనే రంగప్రవేశం చేసి అంతే వేగంగా విజయాలను తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అంతేకాదు అతి పిన్న వయసులోనే మహానటి చిత్రంలో అద్భుతమైన హావభావాలను పలికించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అంతే స్వీడ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా నటిగా దశాబ్ద కాలంలోనే జరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన 15 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని(Antony Thattil) కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకున్న ఆ వెంటనే తాను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా ఇటీవలే తన భర్తతో హనీమూన్ కోసం థాయ్‌ల్యాండ్ వెళ్లి వచ్చిన ఈ బ్యూటీని ఒక భేటీలో కీర్తీసురేశ్ తన వివాహ జీవితం గురించి అగిడిన ప్రశ్నకు తాను వివాహానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే సంతోషంగా ఉన్నానని చెప్పారు. కారణం తాము సుదీర్ఘ కాలంగా డేటింగ్లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసన్నారు. అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్ అంటూ ఏమీ లేదని అన్నారు. తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంటానని, అది తన భర్తకు కాస్త సంకటంగా ఉంటుందన్నారు. అయినా దాన్ని ఆయన ఇబ్బందిగా భావించడం లేదన్నారు. తనను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. అందువల్ల తమ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. కాగా హిందీ చిత్రం బేబీ జాన్ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నూతన చిత్రాలేమీ అంగీకరించలేదు. కీర్తీసురేశ్ నటించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. -
హనీమూన్‌లో విషాదం..
యశవంతపుర: చూడ చక్కని జంట. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపలను చూసి విధికి కన్నుకుట్టింది. హనీమూన్ ముగించుకొని ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను మోసుకొని ఇంటికి వస్తుండగా మృత్యువు పంజా విసిరి నవ వరుడిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హావేరి జిల్లా హిరేకరూరు తాలూకా కొడద గ్రామం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మఠం రాజయ్య, శోభ దంపతుల కుమారుడు సంజయ్(28) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. నవంబర్ 28న బైలహొంగలకు చెందిన టెక్కీ ప్రీతితో వివాహమైంది. కాపురం ఉండేందుకు బెంగళూరులో అద్దె ఇల్లు చూశారు. 12న ఆ ఇంటిలో చేరాల్సి ఉంది. అయితే హనీమూన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. శనివారం ఉదయం సిగందూరు చౌడేశ్వరిని దర్శించుకున్న జంట.. ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకొని తిరిగి జిగళికి వస్తుండగా హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఇద్దరికీ బలమైన గాయాలు కావడంతో రాణెబెన్నూరు ఆస్పత్రికి, తర్వాత దావణగెరెకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సంజయ్ మృతి చెందాడు. స్ట్రెచర్‌లో విగతజీవిగా ఉన్న సంజయ్‌ను చూసి భార్య ప్రీతి కన్నీరుమున్నీరైంది. పోస్టుమార్టం అనంతరం సంజయ్ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు. -
హనీమూన్: భర్తతో విహరిస్తున్న ఎంపీ!
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్ ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్, నిఖిల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ టాప్ ధరించి.. స్టైలిష్ హ్యాట్ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్డ్ బ్లూ టాప్ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్ తెలివిగా చమత్కరించారు. -
హనీమూన్‌లో కార్చిచ్చు.. కష్టాలు!
ఏథెన్స్ : ఓవైపు చెలరేగిన కార్చిచ్చు గ్రామాన్ని మొత్తం బూడిద చేయగా.. మరోవైపు విదేశీయులు సైతం ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. అగ్నికీలలు స్థానికులతో పాటు పర్యాటకుల ప్రాణాలతో చెలగాడమాడాయని అధికారులు అంటున్నారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని మాటీ గ్రామంలో చెలరేగిన కార్చిచ్చులో 100 మంది మంటల్లో కాలిపోగా, మరో 1000 మందికి కాలిన గాయాలైన విషయం తెలిసిందే. హనీమూన్‌కు వచ్చిన ఎన్నో జంటల జీవితంలో కార్చిచ్చు పెను విషాదాన్ని నింపుతోంది. ఐర్లాండ్‌కు చెందిన జోయ్ హోలోహన్, బ్రేయిన్ ఓ కల్లాఘన్ల మనసులు కలిశాయి. కొంతకాలం ప్రేమించుకున్న అనంతరం గత గురువారం ప్రేయసి జోయ్‌తో కల్లాఘన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమకు సమీపంలోని పర్యాటక ప్రాంతమైన ఏథెన్స్లోని మాటీకి వెళ్లారు. కానీ తమ హనీమూన్‌లో కార్చిచ్చు విషాదం నింపనుందని జోయ్ ఆందోళన చెందుతున్నారు. తాజా అగ్నిప్రమాదంలో తమ జంట వేరయిందని, భర్త కల్లాఘన్ జాడ తెలియటం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తనను సిబ్బంది రక్షించి ఆస్పత్రిలో చేర్పించారని, కళ్లు తెరిచి చూసేసరికి భర్త పక్కన లేడని చెప్పింది. పోలీసులకు భర్త ఫొటోతో పాటు వివరాలు ఇచ్చానని, దేవుడి దయ వల్ల అతడికి ఏం కాకూడదని నవ వధువు జోయ్ ప్రార్థిస్తోంది. పర్యాటనకు వచ్చి ఇలా పొరుగు దేశంలో ప్రాణాలు కోల్పోవడం నరక ప్రాయమని బాధిత టూరిస్టులు అంటున్నారు. దేవదారు వృక్షాల్లో మొదలైన చిన్న మంట.. కార్చిచ్చుగా మారి గ్రామాన్ని మొత్తం బూడిద చేసేసింది. ప్రాణాలు రక్షించుకునేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్‌ల వైపు పరుగులు తీశారు. అయినా వందల మందిని కార్చిచ్చు దహించివేసింది. ఆ ప్రాంతాల్లో అగ్గి పదే పదే రాజేసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని గ్రీస్ అధికారులను కోరుతున్నారు. మహా దావానలం.. 100 మంది మృతి -
లండన్‌లో హనీమూన్..!
లవ్... నాగచైతన్య సమంతలది! లండన్... వాళ్ల హనీమూన్ డెస్టినేషన్! అంతే కాదు... మ్యారీడ్ లైఫ్‌లో అవుటాఫ్ ఇండియా వెళ్లడమూ ఇదే ఫస్ట్ టైమ్! యస్... ఇప్పుడు చైతూ–సమంత లండన్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే... వీళ్లిద్దరూ హనీమూన్‌కి న్యూయార్క్ వెళతారనుకున్నారంతా! కానీ, లండన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వారం క్రితమే అక్కడికి వెళ్లారు. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా... ఎవరోఒకరు గుర్తు పట్టి పలకరిస్తారు. మాంచి క్రేజీ కపుల్ అండ్ స్టార్స్ కూడా కదా! లండన్‌లో అయితే... అంత ఇబ్బంది ఉండదు. అందువల్ల, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తాము స్టార్స్ అనే సంగతి మరిచి, చేతిలో చెయ్యేసుకుని చక్కగా సిటీ అంతటినీ చుట్టేస్తున్నారట. మధ్య మధ్యలో అభిమానుల కోసం కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారనుకోండి! అలాగే, చెన్నై రిసెప్షన్‌లోని ఫొటోలను కొన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. కొత్తగా పెళ్లైన ఈ జంట ఇంకో వారం రోజులు లండన్‌లోనే ఉంటారట! ఇండియా తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఎవరి షూటింగులతో వాళ్లు బిజీ బిజీ!! -
బాత్రూంలో చిరుత దూరింది!
వాళ్లకు కొత్తగా పెళ్లయింది. ఏదైనా మంచి ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని హనీమూన్ స్పాట్‌గా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ను ఎంచుకున్నారు. అక్కడ ఉన్నవాటిలో మంచి హోటల్ ఒకదాంట్లో గది బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే.. బాత్రూంలో చిరుతపులి దూరింది! అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఒకవైపు చిరుతపులిని చూసి ఆ కొత్తజంట భయపడితే, మరోవైపు చిరుతపులి కూడా ఎందుకో తెలియదు గానీ, బాత్రూంలో భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. తెల్లవారుజామున 4.45 సమయంలో అద్దం పగిలిన శబ్దానికి తాను లేచానని, చూస్తే కిటికీలోంచి చిరుతపులి లోపలకు దూరిందని.. దాంతో వెంటనే తాను, తన భార్య దుప్పటి కప్పేసుకుని దాక్కున్నామని.. చిరుతపులి నేరుగా వెళ్లి బాత్రూంలో దాక్కుందని సుమిత్ అనే సదరు భర్త చెప్పాడు. వెంటనే తాను వెళ్లి బాత్రూం తలుపు గడియ పెట్టి హోట్ యాజమన్యానికి విషయం చెప్పానన్నాడు. హోటల్ యజమాని అమిత్ సా వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లతో పాటు అటవీ శాఖాధికారులు కూడా వచ్చారు. వాళ్లు వల, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని వచ్చినా.. చిరుతపులి మాత్రం ఎలాగోలా పారిపోయింది. కుక్కలు తరమడంతో అది ఇటువైపు వచ్చి ఉంటుందని, తాము ప్రయత్నించినా పారిపోయిందని నైనిటాల్ డీఎఫ్ఓ తేజస్విని అరవింద్ పాటిల్ చెప్పారు. దాని వయసు సుమారు ఏడాది ఉంటుందని, అడవిలో అయితే సురక్షితంగా ఉంటుందని అక్కడికే వెళ్లిపోయినట్లుందని ఆమె తెలిపారు. భలే దగ్గరగా చూశా చిరుతపులిని చూసి కాస్త భయపడిన మాట నిజమే అయినా.. తర్వాత మాత్రం దాన్ని అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని సుమిత్ భార్య శివాని చెప్పారు. కిటికీకి అద్దం తప్ప వేరే గ్రిల్ ఏమీ లేదని, అందువల్లే అది లోనికి రాగలిగిందని సుమిత్ అన్నారు. హరినగర్ ప్రాంతంలోని మసీదువైపు నుంచి చాలా వీధికుక్కలు తరుముకుంటూ వస్తుండగా చిరుతపులి హోటల్లోకి దూరడాన్ని తాను చూశానని అదే హోటల్లో బసచేస్తున్న మరో అతిథి రాజేష్ సిజ్వాలి చప్పారు. -
వరదల్లో హనీమూన్ జంట
అన్నానగర్ : తిరువేర్కాడులో గత నెల 27న వివాహం చేసుకున్న గౌరీ, రాజశేఖర్ కాశ్మీరు వరదల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే, నగర రవాణా సంస్థ డ్రైవర్ ఎం.కరుణానిధి తన కుమార్తె అయిన గౌరీని రాజశేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. హనీమూన్ కోసం ఈ దంపతులు సెప్టెంబరు 2వ తేదీన కాశ్మీరుకు వెళ్లారు. వీరు సెప్టెంబరు 6వ తేదీన తిరిగి చెన్నై చేరుకోవాల్సి ఉండగా, నేటి వరకూ ఈ హనీమూన్ ప్యాకేజ్ టూర్‌ను బుక్ చేసిన సదరు ట్రావెల్ ఏజెంట్ వధూ-వరుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. కానీ బుధవారం గౌరీ తన తల్లిదండ్రులకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని తెలపడంతో పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తమను చెన్నైకు పంపడానికి ఢిల్లీలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ ఫోన్లో తెలిపిందన్నారు. ఈ నెలాఖరుకి కొత్త పెళ్లి కొడుకైన రాజశేఖర్ కతార్‌లోని కొత్త ఉద్యోగంలో చేరవలిసి ఉందని కరుణానిధి తెలిపారు.