హనీమూన్‌: భర్తతో విహరిస్తున్న ఎంపీ!

Nusrat Jahan enjoys honeymoon with Husband Nikhil - Sakshi

నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌, భర్త నిఖిల్‌ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్‌ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్‌ ఎంపీలైన నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్‌, నిఖిల్‌ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్‌ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్‌, కలర్‌ఫుల్‌ ప్రింటెడ్‌ టాప్‌ ధరించి.. స్టైలిష్‌ హ్యాట్‌ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. 

మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్‌డ్‌ బ్లూ టాప్‌ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్‌ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్‌ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్‌ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్‌ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్‌ తెలివిగా చమత్కరించారు. 


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top