
ఛండీగఢ్: ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వర్షాల కారణంగా పలుచోట్ల చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు తెగిపోవడంతో 35 మంది స్కూల్ పిల్లలు వరద నీటిలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్య సాహసాలతో జుగాద్ అనే పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా పిల్లలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని మల్లెయన్ గ్రామపంచాయతీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లిన పిల్లలకు ఉదయం 10 గంటల తర్వాత స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. దీంతో, వారంతా ఇంటికి వస్తున్న సమయంలో వరదల కారణంగా మల్లెయాన్, రసూల్‌పూర్ గ్రామాలను కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 35 మంది పిల్లలు, యువతులను వరద నీటిలో చిక్కుకున్నారు. పిల్లలంతా భయాందోళన చెబుతున్న సమయంలో వారిని కాపాడేందుకు ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. జుగాద్ అని పిలవబడే ప్రత్యేక పద్దతి ద్వారా వారి రక్షించారు.
సుఖ్‌బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ సహా పలువురు పిల్లలకు సహాయం చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్‌బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ కలిసి మానవ వంతెనను ఏర్పాటు చేశారు. ఐదు అడుగుల లోతులో వారిద్దరూ వంతెనగా ఏర్పడితే.. స్థానికుల సాయంతో పిల్లలను రోడ్డు దాటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలను కాపాడిన వారిద్దరినీ పలువురు ప్రశంసిస్తున్నారు.
शाबाश पंजाबियों...पंजाबी हर वक्त मदद के लिए तैयार रहते है
मोगा के एक गांव की सड़क बह गई। स्कूल जाने वाले बच्चे फंस गए। लोगों ने अपनी पीठ को पुल बनाकर 30 बच्चों को पार कराया। कई साल बाद ऐसी तस्वीर देखने को मिली।
सफेद टीशर्ट और शर्ट वाले युवक की तारीफ होनी चाहिए।#Punjab pic.twitter.com/33e0yu0zJ0— Anwar Ali (@Anwarali_0A) July 24, 2025