● కేయూలో విద్యార్థి సంఘాల ధర్నా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని శ్రీవిద్య సీ నియర్ల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అఽధికారుల నిర్లక్ష్యమని నిరసిస్తూ ఎంఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సేవాలాల్‌సేన, ఏబీఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించా రు. లైబ్రరీ ప్రాంగణం నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ కొనసాగింది. పరిపాలనా భవనంలోనికి దూసుకువచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ శ్రీవిద్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రో జులుగా ఈ విషయంపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు సరిగా స్పందించలేదన్నారు. కార్యక్రమంలో మనోహర్, భాస్కర్ పాల్గొన్నారు.


