విద్య, వైద్య రంగాలతో సమాజ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్య రంగాలతో సమాజ అభివృద్ధి

Mar 19 2026 7:56 AM | Updated on Mar 19 2026 7:56 AM

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

దేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. బుధవారం మండల కేంధ్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేవరుప్పుల హైస్కూల్‌లో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ స్థితిగతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వల్మిడి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయండి

జనగామ: పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. బుధవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టరేట్‌ మినీ కాన్ఫెరెన్స్‌ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ నర్సయ్య, పలువురు అధికారులు ఉన్నారు.

రైతు మహోత్సవంలో పాల్గొనాలి

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్‌ ఫెడ్‌, అనుబంధ శాఖలు, ఆర్టీసీ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, మార్కెటింగ్‌, ఉద్యనవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement