జనగామ రూరల్: మండలంలోని శామీర్‌పేట గ్రామంలోని తెలంగాణ ఎస్టీ బాలికల హాస్టల్‌ను అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, ఆయిల్, పప్పు తదితర సరుకులతో పాటు స్టాఫ్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచెన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులను భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు తెలిపారు. సర్పంచ్ గణిపాక వనితమహేందర్, సిబ్బంది ఉన్నారు.
రాంగ్ రూట్‌లో వెళ్తే చర్యలు
చిల్పూరు: యూటర్న్‌ల వద్ద రాంగ్ రూట్‌లో ప్రయాణం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలోని యూటర్న్ వద్ద చిల్పూరు ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం నినాదంతో ఉన్న పోలీస్ కారు బొమ్మను ఏర్పాటు చేయించగా డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో రాంగ్ రూట్‌లో వెళ్తున్న వాహనాలను ఆపి అవగాహన కల్పించారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వెళ్తే సీసీ కెమరాలకు చిక్కి జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సమ్మయ్య, గడ్డమీది అశోక్, వెంకటస్వామి, సాదం నర్సింహులు, సాదం బీమయ్య, సాదం రాజ్‌కుమార్, ఉంచాల రాజు తదితరులు ఉన్నారు.
సోమయ్యకు
ఉగాది పురస్కారం
దేవరుప్పుల: మారుమూల పల్లెల్లో జీవిస్తూ తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగు అధ్యాపకుడు, సామాజిక కవి అంకాల సోమయ్యకు ఉగాది పురస్కారం లభించింది. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ పరాభావ నామ సంవత్సరం పురస్కరించుకొని ఉగాది కవి సమ్మేళనం, అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యులు ఏనుగు నరసింహారెడ్డి, నందిని సిద్దారెడ్డితో పాటు పలువురి చేతుల మీదుగా సోమ య్య ఉగాది పురస్కారం అందుకున్నారు.
నామినేషన్ ప్రక్రియ పూర్తి
జనగామ రూరల్: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ 2026–27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వై. చంద్రరుషి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు కె.చంద్రశేఖర్, పి.చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో నామినేషన్ పక్రియ పూర్తి చేశారు. ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థులుగా దయాకర్‌రెడ్డి, కె.ఎల్లారెడ్డి, పానుగంటి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్షులుగా టి.రాజయ్య, ఎన్. సిద్దులు, ఎన్.రేణుక, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సత్తయ్య, సీహెచ్ నర్సింగరావు నామినేషన్లు వేశారు. కాగా సెక్రటరీగా ఎంవీ భద్రినాఽథ్, కోశాధికారిగా ఎన్.శ్రీమన్, జి.అమృతయ్య, క్రీడలు, సౌంస్కృతిక కార్యదర్శిగా బాలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శిగా ఎం.స్వప్న, కే.సునీతారాణి నామినేషన్ వేశారు. ఈసీ మెంబర్లుగా ఎన్.కల్యాణి, జ్యోత్స్న, దయామని, సంపత్, శ్రీనివాస్‌లు నామినేషన్లు వేశారు. ఈ నెల 20న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.


