● కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన మహిళలు
జనగామ రూరల్: పేద మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనితా టీ స్టాల్, విజయ మిల్క్ డెయిరీ స్టాల్‌ను తొలగించవద్దని మహిళలు సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొట్ల శేఖర్, బూడిది గోపి మాట్లాడుతూ.. పాలమాకుల చిన్నమంజుల, పొత్కసూరి విజయలక్ష్మి ఉపాధి కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో టీస్టాల్, విజయ మిల్క్ స్టాల్ కలెక్టరేట్ గోడ వద్ద ఏర్పాటు చేశారని, ఉపాధికోసం ఏర్పాటు చేస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సంబంధిత విషయంపై భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లగా స్టాళ్లను అలాగే కొనసాగించాలని ఇచ్చిన లేఖను కలెక్టర్‌కు అందించారు.పట్టణంలో ప్రజాసమస్యలు అనేకం ఉన్నాయని వాటిపై అధికారులు దృష్టిపెట్టాలని కోరారు.


