జనగామ రూరల్: ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిశాయని పరీక్షల నిర్వహణకు సహకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, పోలీసు అధికారులకు, ఇతర శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా చివరి రోజు పరీక్షకు 77 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్‌లో 3,085 మందికి గాను 3,044 మంది హాజరుకాగా 41 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 576 మందికి 540 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరయ్యారన్నారు.


