బదిలీ కలెక్టర్‌కు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

బదిలీ కలెక్టర్‌కు వీడ్కోలు

Mar 8 2026 7:51 AM | Updated on Mar 8 2026 7:51 AM

జనగామ: జిల్లాలో రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లాకు వెళ్లిన కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషాకు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పని చేసిన పలువురు అధికారులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఈసందర్భంగా షేక్‌ రిజ్వాన్‌ బాషా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్షాలోమ్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు, టీఎన్జీఓ, టీజీఓ యూనియన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

‘ఎవరిపై దౌర్జన్యంగా వ్యవహరించలేదు’

జనగామ రూరల్‌: తమ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సత్వర న్యాయం చేస్తున్నామని, ఎవరిపై దౌర్జన్యంగా వ్యవహరించలేదని తహసీల్దార్‌ మోసిన్‌ శనివారం తెలిపారు. పెద్దరాంచర్ల గ్రామానికి చెందిన మహిళపై, సర్పంచ్‌ వల్లాల మల్లేశంపై ఎలాంటి దుర్భాషలాడలేదన్నారు. తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, అందులో నిజం లేదన్నారు. సంబంధిత వ్యక్తిపై 2వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నట్లు పేర్కొన్నారు. కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

పరిశుభ్రతకు పాటుపడాలి

జనగామ రూరల్‌: గ్రామంలోని పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డీఎల్పీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా శనివారం మండలంలోని శామీర్‌పేటలో సర్పంచ్‌ గణిపాక వనిత మహేందర్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ సంపత్‌ కుమార్‌, కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్‌ నరేందర్‌, టి.నర్సింగ్‌, వార్డు సభ్యులు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నేడు జిల్లా స్థాయి రిలే కార్నివాల్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు

జనగామ రూరల్‌: జిల్లా స్థాయి రిలే కార్నివాల్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు ఆదివారం పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో 14 ఏళ్ల బాలబాలికలు, 20 ఏళ్ల యువతకు అథ్లెటిక్స్‌ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాలకు 98850 46437, 99124 53220, 77995 52233, 99852 23047 నంబర్‌కు ఫోన్‌ చేసి పూర్తి వివరాలు పొందవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement