శ్రీనిధి అవకతవకలపై విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

శ్రీనిధి అవకతవకలపై విచారణ జరిపించాలి

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

పాలకుర్తి టౌన్‌: నియోజకవర్గంలో శ్రీనిధి సంస్థలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిసి గత ప్రభుత్వంలో శ్రీనిధి వ్యవహారంలో జరిగిన అక్రమాలతో నష్టపోయిన బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పులిరాజు

జనగామ: జనగామ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎస్‌డీసీ/ఎల్‌ఏ)గా పులిరాజు ఉంద్రజవరపునకు పదోన్నతితో పోస్టింగ్‌ ఇస్తూ మంగళవారం ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమల్లోకి వచ్చేలా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా నియమించబడిన అధికారుల రిలీవ్‌, జాయినింగ్‌ తేదీలను ప్రభుత్వంకు తెలియజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

తాత్కాలిక ఎస్‌హెచ్‌ఓగా ట్రెయినీ ఐపీఎస్‌ మనీషా నెహ్రా

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు 12 వారాలకు గాను ఎస్‌హెచ్‌ఓగా రాజస్థాన్‌కు చెందిన ట్రెయినీ ఐపీఎస్‌ మనీషానెహ్రా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ట్రెయినీ ఐపీఎస్‌ మాట్లాడుతూ.. ఐపీఎస్‌ శిక్షణలో భాగంగా 12 వారాల పాటు ఇక్కడ ఎస్‌హెచ్‌ఓగా విధులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ భద్రతా నియమాలు పాటించాలి

జనగామ: విద్యుత్‌ వినియోగదారులు, రైతులు విద్యుత్‌ సంబంధిత పనుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రమాదాలు చిన్న నిర్లక్ష్యంతోనే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. భారీవర్షాలు, గాలిదుమారాల సమయంలో తీగలు తెగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లో వెంటనే సంబంధిత ఏఈ, లైన్‌మన్‌, సెక్షన్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గృహాల్లో నాణ్యమైన వైరింగ్‌ ఉండేలా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement