రోబోటిక్స్‌ షేర్‌–అవుట్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్‌ షేర్‌–అవుట్‌ షురూ

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

జనగామ: రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డిజిటల్‌ లెర్నింగ్‌పై జిల్లా స్థాయి స్టూడెంట్స్‌ షేర్‌–అవుట్‌ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సత్యమూర్తి, అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఉపేందర్‌ ప్రారంభించారు.

విద్యార్థుల ఆవిష్కరణలు ప్రశంసనీయం

విద్యార్థులు రూపొందించిన మోడళ్లు, ప్రయోగాలు ప్రశంసనీయమని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సత్యమూర్తి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతిక ధోరణుల్లో నిలబడాలంటే సృజనాత్మకత, విజ్ఞానపరమైన దృక్పథం అవసరమని విద్యార్థులకు సూచించారు. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ గట్టు రమేశ్‌ మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికై న 68 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు, ప్రోటోటైప్‌లను జిల్లా స్థాయిలో ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమం శాసీ్త్రయ దృక్పథంతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అమెరికన్‌ ఇండియా, ఫౌండేషన్‌ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 11న డిజిటల్‌ లెర్నింగ్‌ను సమర్థంగా అమలు చేసిన ఉపాధ్యాయులకు సత్కారం నిర్వహించనున్నారు.

విద్యార్థులకు కొత్త అవకాశాలు

డిజిటల్‌ ఈక్వలైజర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌టీఈఎం విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రమేశ్‌ తెలిపారు. జనగామ మండలం పెంబర్తి ఉన్నత పాఠశాలలో రూ.13 లక్షల వ్యయంతో ఇన్నోవేషన్‌ అండ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ సహా ఆధునిక సాంకేతికతపై శిక్షణ పొందుతున్నారన్నారు. స్టూడెంట్స్‌ షేర్‌–అవుట్‌ కార్యక్రమం ద్వారా జిల్లా విద్యార్థులు తమ సృజనాత్మక, ఆలోచనలు, సాంకేతిక ప్రతిభను ప్రదర్శించినట్లు తెలిపారు. భవిష్యత్‌ సాంకేతిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని ఆవిష్కరణలకు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు.

68 మంది విద్యార్థుల టెక్‌ ప్రాజెక్టుల ప్రదర్శన

ఏఐ, ఎంఎల్‌ మోడళ్లకు అధికారుల ప్రశంసలు

నేడు ఉపాధ్యాయులకు సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement