సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

– IIలోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026

ఈనెల 14 నుంచి ఏప్రిల్‌ 15 వరకు పదో తరగతి పరీక్షలు

జనగామ: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 14 నుంచి ప్రా రంభమయ్యే పరీక్షలకు 6,645 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3,186, బాలికలు 3,259 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 183 పాఠశాలల్లో 40 ప్రైవేటు, 143 ప్రభుత్వ పాఠశాలలు పరీక్షల్లో ఉన్నాయి.

39 కేంద్రాలు..

పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌ చొప్పున 39 మంది, 4 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు, 383 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పోలీస్‌ స్టేషన్లకు దూరంగా ఉన్న 8 సెంటర్లను సీ సెంటర్లుగా గుర్తించగా, ప్రశ్నపత్రాల రవాణా, భద్రతను కస్టోడియన్‌ పర్యవేక్షించనున్నారు. ప్రశ్నపత్రాలకు సంబంధించి రెండు సెట్లను ఇప్పటికే ఆయా పోలీస్‌ స్టేషన్లలోని స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు.

ఆబ్జెక్టివ్‌ మార్గదర్శకాలు

ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల పంపిణీ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఫిజిక్స్‌, బయాలజీ పరీక్షకు 15 నిమిషాల ముందు, ఇంగ్లిష్‌ పరీక్షకు ప్రారంభంలోనే, తెలుగు, హిందీ, సోషల్‌, గణితం పరీక్షల సమయంలో 30 నిమిషాల ముందు ఆబ్జెక్టివ్‌ పేపర్‌ అందజేయనున్నారు. ఈసారి కొత్తగా తీసుకొచ్చిన మరో ప్రధాన నిబంధన ఏమిటంటే, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ మూడు భాషా పేపర్లు పూర్తయిన రోజునే వాటి పేపర్‌ వాల్యుయేషన్‌ చేపట్టనున్నారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి అన్ని సెంటర్లలో డ్యూయల్‌ డెస్క్‌లు తప్పని సరి చేశారు. ప్రతీ విద్యార్థికి 24 పేజీల బుక్‌లెట్‌ అందజేసి అందులోనే అన్ని సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సైనన్స్‌ పరీక్ష కోసం మాత్రమే 12 పేజీల ఓఎంఆర్‌ షీట్‌ ఇవ్వనున్నారు.

14 నుంచి పరీక్షలు

పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌ 15న ఒకేషనల్‌ పరీక్ష నిర్వహించనుండగా, మొత్తం పరీక్ష ప్రక్రియ ఏప్రిల్‌ 16తో పూర్తవుతుంది. ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి జిల్లాలోని 10 మోడల్‌ స్కూల్స్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ కేజీవీబీ గురుకులాల్లో చదువుతున్న 713 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఐటీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం, బ్యూటిషియన్‌ వంటి విభాగాల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం అన్ని సెంటర్లలో తాగునీరు, టాయిలెట్లు, అత్యవసర వైద్యసేవల సమయంలో హెల్త్‌ క్యాంప్‌ వంటి అన్ని వసతులు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సమగ్రమైన ఏర్పాట్లతో ఈ ఏడాది పది పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

అంతా సిద్ధం చేశాం..

జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు కలుపుకుని 183 ఉండగా, 39 సెంటర్లను ఏర్పాటు చేశాం. 6,445మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రశ్న పత్రాలు పోలీస్‌ స్టేషన్‌ స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను ఓపెన్‌ చేస్తారు.

– టి.రవికుమార్‌, ఏసీజీ, విద్యాశాఖ

కొత్తగా క్లాక్‌రూమ్‌ సేవలు..

జిల్లాలో 183 ఉన్నత పాఠశాలలు.. 39 సెంటర్లు

హాజరుకానున్న 6,445 మంది విద్యార్థులు

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ పరీక్షలు పూర్తికాగానే మూల్యాంకనం

విద్యార్థుల సామగ్రి భద్రత కోసం క్లాక్‌ రూమ్‌ సేవలు

పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్‌ నిషేధం

ఒకేషనల్‌ పరీక్షలకు 713 మంది విద్యార్థులు

పరీక్ష కేంద్రాల్లో ఈసారి కొత్తగా క్లాక్‌ రూంలను ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. విద్యార్థులు వెంట తెచ్చుకునే గైడ్లు, ఎలక్ట్రానిక్‌ వాచీలు, ఇతర వస్తువులను ఈ గదుల్లో భద్రపరిచే అవకాశం ఉంటుంది. పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఈ నిబంధన చీఫ్‌ సూపరింటెండెంట్‌ సహా బయట నుంచి వచ్చేవారితో పాటు కేంద్రంలో పనిచేసే ప్రతీ అధికారికి వర్తిస్తుంది. సెంటర్‌ ప్రాంగణంలో వాహనాలకు కూడా అనుమతి లేదు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఫిజిక్స్‌, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement