● డీసీపీ రాజమహేంద్రనాయక్
స్టేషన్‌ఘన్‌పూర్: డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవా రం డివిజన్ కేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి శివాజీ చౌక్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం స్థానిక మాగార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన సమావేశా నికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో నార్కోటిక్ సీఐ దీలీప్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ చంద్రకాంత్‌రెడ్డి, ఫైర్ ఎస్‌ఐ దేవేందర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, ఎంఈఓ కొమురయ్య, సీడీపీఓ సరస్వతి, డాక్టర్ అజయ్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
డ్రగ్స్‌పై కలిసి పోరాడాలి
పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసి పోరాడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బాషారత్ గార్డెన్‌లో మంగళవారం ఎస్సై దూలం పవన్‌కుమార్ అధ్యక్షతన ఓ యువత మేలుగో...డ్రగ్స్ మానుకో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనపై డీసీపీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ చౌరస్తాలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విస్నూరు, బమ్మెర, గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, వైద్యాధికారి బండి ఉషా, ఎస్సైలు రంజిత్‌కుమార్, యాకుబ్ హుస్సేన్ పాల్గొన్నారు.


