డ్రగ్స్‌తో యువత భవిష్యత్‌ నాశనం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో యువత భవిష్యత్‌ నాశనం

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

జనగామ: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును ఛిద్రం చేసే ప్రమాదకర శక్తిగా మారిపోయిందని హైదరాబాద్‌ ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ పి.సీతారాం నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్‌ఎంఆర్‌ గార్డెన్స్‌ వరకు కొనసాగింది. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది భారీగా పాల్గొన్నారు. అనంతరం ఎన్‌ఎంఆర్‌ గార్డెన్స్‌, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సుల్లో పాల్గొని ఎస్‌పీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ.. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు కొత్త పద్ధతి అందుబాటులోకి వచ్చిందన్నారు. మూత్రపరీక్ష ద్వారా 30 రోజుల వరకు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్థారించగల సామర్థ్యం దీనిలో ఉందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అనంతరం విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలామణిశ్రీనివాస్‌, సీజేఐటీ డైరెక్టర్‌ ఫాదర్‌ విజయపాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్‌, చెన్నకేశవులు, నర్సయ్య, డాక్టర్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, సేవెల్లి మధు, పానుగంటి సువార్త, లింగాల నర్సిరెడ్డి, అన్వర్‌ తదితరులు ఉన్నారు.

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

జనగామ రూరల్‌: మత్తు పదార్థాలకు ప్రతీ ఒక్కరు దూరంగా ఉండాలని ఎస్పీ సీతారాం నాయక్‌ అన్నారు. మండలంలోని పెంబర్తి ఎంజేపీ పాఠశాలలో ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌, సీఐ సత్యనారాయణ, సర్పంచ్‌ చిన్నబోయిన రేఖరాజు, ప్రిన్సిపల్‌ అనిత, నార్కోటిక్‌ ఎస్‌ఐ శ్రీతేజ, ఎస్‌ఐ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ పి.సీతారాం నాయక్‌

డ్రగ్స్‌కు నో.. విద్యార్థులచే ప్రతిజ్ఞ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement