న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
జలసంరక్షణతోనే
జిల్లా సగటు (మీటర్లలో)
గతేడాది కంటే మెరుగ్గానే భూగర్భజలాలు
జనగామ: జిల్లా పరిధిలో భూగర్భ జలాల స్థితిలో స్వల్ప మార్పులే నమోదయ్యాయి. ఫిబ్రవరి 2025, ఫిబ్రవరి 2026, అలాగే జనవరి 2026 నెలలోని నీటి మట్టాలను పరిశీలిస్తే, కొన్ని మండలాల్లో పెరుగుదల కనిపించగా, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుదల చోటుచేసుకుంది. జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం ప్రకారం ఫిబ్రవరి 2025లో 8.01 మీటర్లు, జనవరి 2026లో 5.01 మీటర్లు, ఫిబ్రవరి 2026 వచ్చే సరికి కేవలం 5.99 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించారు.
నిలకడగా ఉన్నా.. రాబోయే రెండు నెలలపై ఆందోళన
జనవరి 2026తో పోలిస్తే ఫిబ్రవరి 2026లో స్వల్ప తగ్గుదల (సుమారు 0.98 మీటర్లు) కనిపించినప్పటికీ, ఫిబ్రవరి 2025తో పోలిస్తే నీటిమట్టం మెరుగైన స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న నీటి మట్టంతో భూగర్భజలాలు నిలకడగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో నీటి మట్టం మెరుగుపడిన చోట్ల వ్యవసాయ, తాగునీటి బోర్లు స్థిరంగా పనిచేస్తున్నాయి. అయితే అధిక లోతు ప్రాంతాల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం వల్ల వేసవిలో అదనపు నీటి సంరక్షణ చర్యలు అవసరం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లా సగటు నీటిమట్టం ప్రస్తుతం 5.99 మీటర్ల వద్ద ఉండడం సానుకూల సంకేతమే అయినప్పటికీ, రాబోయే రెండు నెలలు కీలకమని అధికారులు భావిస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో, యాసంగి సీజన్ పంటలతో పాటు పంచాయతీల నుంచి మున్సిపల్ పరిధి వరకు నీటివినియోగంపై ముందస్తు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లా భూగర్భ జలాల పరిస్థితి గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ, నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
దేవాదుల ఒక్కటే శరణ్యం
దేవాదుల కాలువల ద్వారా సాగునీటి విడుదల ఒక్కటే యాసంగి సీజన్‌కు ఊపిరిగా రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని చెరువుల్లో 25 నుంచి 50శాతం మేర నీటినిల్వలు ఉండగా, యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కాలువల ద్వారా చెరువులకు జలాలను తరలిస్తే.. పడిపోతున్న భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరి పంటకు అరకొర సాగునీరు అందించే గడ్డుకాలం మొదలైంది.
అయినా వేసవి తీవ్రతతో సాగుభయం
దేవాదుల ఒక్కటే శరణ్యమంటున్న రైతులు
చెరువులు నింపితేనే పంట చేతికి
వస్తుందంటూ విన్నపం
జిల్లాలో మొదలవుతున్న సాగునీటి కష్టాలు
మండలం(ఊరు) ఫిబ్రవరి–25 జనవరి–26 ఫిబ్రవరి–26
బచ్చన్నపేట 9.16 4.5 5.24
దేవరుప్పుల 4.2 1.83 2.38
జనగామ 4.79 2.61 3.14
కొడకండ్ల 10.21 7.77 8.55
లిం.ఘణపురం 7.15 3.97 5.62
పాలకుర్తి 9.91 4.35 6.15
రఘునాథపల్లి 10.05 5.86 7.29
తరిగొప్పుల 9.02 3.06 3.92


