జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3, 4, 5వ తరగతి విద్యార్థులకు ఏఐ ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఏఎంఓ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 12 పాఠశాలల్లో 55 మంది ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు 27 మంది ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఐపై డీఆర్పీలు శ్యామ్మోహన్‌రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుజిత్ శ్రావణి, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. నేడు (గురువారం) మరో 28 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


