స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ వరకు ఉన్న రైల్వే ఫ్లైౖఓవర్‌పై లైట్లు వెలగకపోవడంతో అంధకారంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి శివునిపల్లి, జఫర్‌గఢ్, ఐనవోలు, వర్ధన్నపేట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు ప్రధాన మార్గంగా ఉన్న ఈ ఫ్లైౖఓవర్ బ్రిడ్జిపై కొద్ది రోజులుగా లైట్లు వెలగడం లేదని ప్రజలు వాపోతున్నారు. దాంతో ఈ ఫ్లైౖఓవర్‌పై రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఫ్లైౖఓవర్‌పై వెళ్లే వాహనదారులు భయంభయంతో నెమ్మదిగా వెళ్తున్నారు. గతంలో ఈరోడ్డుపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లైట్లను వీలైనంత తొందరగా వేయించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.


