జనగామ: ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో పోటీచేసిన అభ్యర్థులు ఎలక్షన్ల ఖర్చులు చూపించాలని జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎలక్షన్ లెక్కల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అబ్జర్వర్‌కు ఈ నెల 29 వరకు సమర్పించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా జనగణన–2027 విధులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు వరుసగా జనగామ జిల్లాలో చదివి ఉండడంతో పాటు స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను జతపరిచి, కలెక్టరేట్‌లోని రెండో అంతస్థు 29వ నెంబర్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి ఓల్డ్ సబ్‌స్టేషన్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈసందర్భంగా విఽనియోగదారుల నుంచి 22 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్‌రెడ్డి, డీఈ లక్ష్మినారాయణరెడ్డి, ఎస్‌ఏఓ సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అగ్రికల్చర్ ఏటీఎంఏ, బీఎఫ్‌ఏసీ సభ్యుల ఎంపిక
జనగామ: మండల స్థాయిలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ(ఏటీఎంఏ) పథకం కింద బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ (బీఎఫ్‌ఏసీ), (డీఎ్‌ఫ్‌ఏసీ) సభ్యుల ఎంపిక కోసం అర్హులైన ప్రగతిశీల రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీఎంఏ 2025–26 మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో రైతుల అవసరాలు, సమస్యలు, సూచనలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీఎఫ్‌ఏసీ కమిటీ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కమిటీ ద్వారా బ్లాక్‌స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, రైతుల భాగస్వామ్యం పెంపొందుతుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో (పాడి, ఉద్యానవన పంటలు, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, ప్రకృతి వ్యవసాయం) అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల రైతు లు తమ దరఖాస్తులను సంబంధిత మండల వ్యవసాయ అధి కారి (ఎంఏఓ) కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ లోపు సమర్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు జిల్లా పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


