● ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా
పనిచేయాలి
● మున్సిపాలిటీ తొలి వార్షిక బడ్జెట్
సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అధ్యక్షతన 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడు తూ.. బడ్జెట్ అంచనాలపై చర్చించారు. 2026–27 సంవత్సరానికి గాను రూ.63,33,70,000ల బడ్జెట్ అంచనాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. పట్ణణ కేంద్రంలోని బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన భూమిని లీజుకు తీసుకుని అందులో మార్కెట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయగా. పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా పట్ట ణ కేంద్రంలోని పార్కును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని, వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకునేలా తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
నిధుల వినియోగంపై ప్రశ్నించిన బీఆర్‌ఎస్
సమావేశంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు బూర్ల రాజేశ్వర్, పొన్న రాజశేఖర్, అనీల్‌గౌడ్, తాటికొండ మధు, చల్లా రమ్యరఘురెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వచ్చిన నిధుల వినియోగంపై ప్రశ్నించారు. మున్సిపాలిటీకి వచ్చిన రూ.50 కోట్ల నిధులలో ఇప్పటివరకు ఎక్కడెక్కడ టెండర్లు పిలి చారు, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, పెండింగ్‌లో ఏమి ఉన్నాయి.. తదితర వివరాలు తెలుపాలని కోరారు. కాగా ఏఈ ద్వారా కౌన్సిలర్లకు వివరాలను అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి
నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేలా అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నుల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు పేదలపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


