స్వచ్ఛతకు వారధినవుతా.. | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతకు వారధినవుతా..

Mar 8 2026 7:51 AM | Updated on Mar 8 2026 7:51 AM

– వివరాలు10లోu

శానిటేషన్‌ కార్మికులతో..

(ఉదయం 5 గంటలకు)

చైర్‌పర్సన్‌: అమ్మా మీ సమస్యలేంటి?

గుర్రం లక్ష్మి: ఈఎస్‌ఐ ఆలస్యం చేయొద్దు. శానిటేషన్‌ కార్మికులకు ఓ కాలనీ ఏర్పాటు చేయండి. అందరం అద్దెకు ఉంటున్నాం. సొంత ఇల్లు, ఖాళీ స్థలం లేదు. మాకో సపరేట్‌ కాలనీ ఉండాలని కోరుకుంటున్నాం.

చైర్‌పర్సన్‌: ఆరోగ్య సమస్యలున్నాయా?

బొట్ల లక్ష్మి: రహదారులు శుభ్రం చేసే సమయంలో దుమ్మంతా కడుపులోకి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య రక్షణ కిట్లు అందించాలి. సబ్బులు ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు. చీపుర్లు, చెప్పులు కావాలి, టవల్‌ ఇవ్వట్లేదు. డ్రెస్‌ చినిగిపోయింది.

చైర్‌పర్సన్‌: వేతనాలు ఎలా ఉన్నాయి?

దేవేంద్ర: 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్న. రెగ్యులర్‌ కాలేదు. ఇల్లు లేదు. వేతనాలు తక్కువ. రూ.10 వేల నుంచి పైకి పెరగడం లేదు. మా కష్టానికి తగ్గట్టుగా జీతాలు ఉంటే బాగుంటుంది.

చైర్‌పర్సన్‌: మీ బాధలేంటి?

కనకమ్మ: మాకు వచ్చే వేతనంతో ఇల్లు కిరాయి కట్టుకోవాలి. ఇంకా వేరే ప్రైవేట్‌ పని చేసుకునే వీలు లేదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ప్రైవేటు బడుల్లో ఉచిత విద్యను అందించేలా చూడాలి. ఇదొక సాయం చేయండి. ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం.

చైర్‌పర్సన్‌: మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి?

గోలి సుగుణ: మమ్మల్ని మీ బిడ్డలం అనుకోండి. మాకు మంచి చేసేందుకు ప్రయత్నించండి. రోడ్లమీద పని చేసి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తే ఖర్చులు భరించలేకపోతున్నాం. మేం లేచింది మొదలు ఇంటికి వెళ్లే వరకు దుమ్ములోనే ఉంటున్నాం. ఊపిరితిత్తుల సమస్య వస్తోంది. హాస్పిటల్‌ కార్డు చెల్ల ట్లేదు. వైద్య పరీక్షల డబ్బులు వచ్చేలా చూడాలి. వా ర్డులతో పాటు కలెక్టరేట్‌లోనూ పని చేయిస్తున్నారు.

22 వ వార్డులో.. (ఉదయం 8 గంటలకు)

చైర్‌పర్సన్‌: కాలనీకి ఏం కావాలి?

కాతబోయిన యాదమ్మ: 22వ వార్డులో బతుకమ్మ ఆడుకునేందుకు స్థలం కావాలి. మేమందరం సమావేశమయ్యేందుకు ఓ ఆఫీస్‌ ఉండాలి. మంచినీళ్ల ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. మైసమ్మ గుడిని అభివృద్ధి చేయాలి. మా బిడ్డకు ఇందిరమ్మ ఇల్లు, పింఛన్‌ మంజూరు చేయించండి.

చైర్‌పర్సన్‌: అవ్వా.. పరిసరాలు ఎలా ఉన్నాయి?

నర్సవ్వ: ఇంటి ముందు మోరీ లేదు. మమ్మల్ని మీరే పట్టించుకోవాలి. మిమ్మల్ని చూస్తే మాకు నమ్మకం కలుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించండి. ఇంటి ముందు పోల్‌కు బుగ్గ పోవడంతో చీకటిగా ఉంది. లైట్‌ పెట్టించండి.

చైర్‌పర్సన్‌: పరిశుభ్రత ఎలా ఉంది?

అయిలమ్మ: మోరీలను ప్రతీ వారం శుభ్రం చేయాలి. రోడ్లు రోజూ ఊడ్చాలి. చెత్తను తరలించాలి. పరిసరాలను మేం కూడా స్వచ్ఛతగా ఉంచుకుంటాం. ఆరోగ్యంగా జీవిస్తాం.

చైర్‌పర్సన్‌: అక్కకు పింఛన్‌ వస్తుందా?

కవిత: రాధికకు మాటలు రావు. దివ్యాంగుల పింఛన్‌ కావాలి. గతంలో దరఖాస్తు పెట్టుకున్నాం. మీరే సాయం చేయాలి.

చైర్‌పర్సన్‌: ఏమైంది తల్లీ?

యాదమ్మ: ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆనందంతో పిల్లర్ల వరకు వేసుకున్నాం. పట్టా ఇచ్చి క్యాన్సిల్‌ చేశారు. ఇల్లు మళ్లొచ్చేలా చూడాలి. అధికారులను పురమాయించాలి.

మహిళలు పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలి

జనగామ రూరల్‌: మహిళలు సమాజంలో పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలని, ఆర్థిక శక్తిగా నిలవాలని ిసీనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత అన్నారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ఏకశిల డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంతో ముందుకు సాగాలని, ప్రతీ విషయం తెలుసుకోవాలని, మగవారితో సమానంగా పోటీ పడే శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ మహిళ చట్టాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, రాలేని పరిస్థితి ఉంటే లెటర్‌ ద్వారా కూడా తెలియజేయవచ్చని సూచించారు. పలు చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మంచాల రవీంద్ర, స్కోప్‌ ఎన్జీఓ మనోజ్‌ కుమార్‌, భరోసా సెంటర్‌ దయామణి, సుధా, వైస్‌ ప్రిన్సిపల్‌ జి.నలిదికుమారి, బి.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

జనగామ పురపాలిక చైర్‌పర్సన్‌

సమస్యల పరిష్కారానికి సారథినవుతా..

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం.. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడడం.. వీధి దీపాలు, పన్నుల వసూలు, అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణాలు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక.. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం.. ఇలా నిత్యం పట్టణాభివృద్ధిలో ఆమెది కీలక పాత్ర. అంతటి ప్రాధాన్యమున్న విధులు నిర్వర్తిస్తూనే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ మీడియా వీఐపీ రిపోర్టర్‌గా శనివారం క్షేత్రస్థాయిలో ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కార మార్గం చూపేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 22వ వార్డు ప్రజలతో ముఖాముఖి అయ్యారు. – జనగామ

సీనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత

కార్మికుల సమస్యలు ఒకొక్కటిగా పరిష్కరిస్తాం

‘డ్రెయినేజీ, పారిశుద్ధ్యం’పై ప్రత్యేక ప్రణాళిక

మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌, పురపాలిక చైర్‌పర్సన్‌ కడమంచి బాలమణి శ్రీనివాస్‌

క్షేత్రస్థాయిలో శానిటేషన్‌ కార్మికులతో ముఖాముఖి

ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం..

డ్రెయినేజీ, స్వచ్ఛత, వీధి దీపాలు వంటి సమస్యలపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పది రోజుల్లో వార్డుల్లో మార్పు ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారు. ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులు సూచించిన విధంగా శానిటేషన్‌ కార్మికులు పది రోజుల పాటు కష్టపడి పని చేయాలి. వారి సమస్యలు, అభివృద్ధి, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా పరిష్కారం చూపుతా.

– కడకంచి బాలమణి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement