జనగామ: కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినో త్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డాక్టర్ లక్ష్మినారాయణ, ఆర్‌ఎంఓ కోటాచలం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ భిక్షపతి, నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, హెడ్ నర్సులు విజయ నిర్మల, వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేశారు. అనంతరం రాజలింగం సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. అనారోగ్యకర జీవనశైలి, నీటి వినియోగం తగ్గడం, మోతాదు లేని మందుల వాడకం కారణంగా కిడ్నీలపై ప్రభావం పడుతోందని తెలిపారు. షుగర్, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులు, టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం


