● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే శ్రీహరి,
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకాంక్షించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలులో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్‌ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, గ్రంథాలయ సంస్థ కమిటీ చైర్మన్ మారుజోడు రాంబాబుతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అనంతరం జిల్లా అధికారులను శాలువాతో సత్కరించి, ప్రశంసపత్రాలను అందజేశారు. అదే విధంగా వివిధ శాఖల ఉద్యోగినులకు ప్రశంసపత్రాలతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ కోదండరాములు, డీసీపీఓ రవికాంత్, మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ శారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


