అధిక ధరలతో అవస్థలు.. | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలతో అవస్థలు..

Mar 13 2026 8:12 AM | Updated on Mar 13 2026 8:12 AM

అధిక ధరలతో అవస్థలు.. పేదలపై ఆర్థిక భారం

నిత్యవసర ధరలు పెంచడంతో అవస్థ పడుతున్నాం. ఆర్థిక భారం పెరిగింది. మా కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలుపుకుని 12 మందిమి ఉన్నాం. గ్యాస్‌, నూనె, పప్పుల ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. నెలవారీగా వచ్చే ఆదాయానికి ధరలు రెట్టింపు కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది.

యుద్ధంతో పేద, మధ్యతరగతిపై ఆర్థిక భారం పడుతోంది. మా కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉంటారు. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా ఇంట్లో నెలకు మూడు కిలోల నూనె అవసరం పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పేదల బతుకులు దుర్భరంగా మారుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేపట్టాలి.

– మారేపల్లి ప్రసాద్‌,

ప్రైవేట్‌ ఉద్యోగి, స్టేషన్‌ఘన్‌పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement