పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జనగామ రూరల్‌: పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోపమ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల డిగ్రీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్‌, స్టాక్‌ రిజిస్టర్లు రైస్‌, ఆయిల్‌, పప్పు తదితర సరుకులు, స్టాఫ్‌ అటెండెన్స్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులనే భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్‌, వార్డెన్‌లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement