లక్ష మల్లెపూలతో అభిషేకం | - | Sakshi
Sakshi News home page

లక్ష మల్లెపూలతో అభిషేకం

Mar 16 2026 7:50 AM | Updated on Mar 16 2026 7:50 AM

జనగామ: జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్‌ సమీపంలోని శ్రీ ఉప్పలమ్మతల్లి ఆలయంలో ఆది వారం అమ్మవారికి లక్ష మల్లెపూలతో పూలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వారణాసి పవన్‌శర్మ మంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక విష్ణులలితా సహస్ర నామాలను పారాయణం చేశా రు. అమ్మవారిని దర్శించుకుని, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నేటి నుంచి ఒంటిపూట బడులు

జనగామ రూరల్‌: ఈనెల 16 (సోమవారం) నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమవుతున్నాయని విద్యాశాఖ అధికారుల అదివారం తెలిపారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుందన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో తరగతులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్‌ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్‌కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్‌ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యాత్రను రచనగా చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా, అక్కడి సంస్కృతి అందరికి తెలిసేలా చేసిన రచయిత శ్యాంసుందర్‌ అభినందనీయుడని అన్నారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్‌రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి అతిథులుగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్‌రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్‌రావు, దిలీప్‌కుమార్‌, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ షురూ

విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్‌: ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను ఆదివారం ప్రారంభించినట్లు హనుమకొండ, వరంగల్‌ డీఐఈఓలు ఎ.గోపాల్‌, శ్రీధర్‌సుమన్‌ తెలిపారు. వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల జవాబు పత్రాలు, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జనగామ, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్మీడియట్‌ బోర్డు పరిశీలకుడు రాజన్న మూల్యాంకన కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. హనుమకొండ క్యాంపు ఆఫీసర్‌గా డీఐఈఓ ఎ.గోపాల్‌, అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్‌ జనరల్‌–1గా హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.శ్రీనివాస్‌రావు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement