పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన

Mar 16 2026 7:50 AM | Updated on Mar 16 2026 7:50 AM

జనగామ రూరల్‌: పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ కళాశాల ఎన్‌న్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ జ్యోత్స్న అన్నారు. పెంబర్తి గ్రామంలో ఎనన్‌ఎస్‌ఎస్‌ శిబిరంలో భాగంగా ఆదివారం పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పర్యావరణాన్ని సంరక్షించడం, చెట్ల పెంపకం, నీటి వనరులను కాపాడటం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. భవిష్యత్‌ తరాలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement