● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ, సమ్మక్క–సారలమ్మ, మధు స్వరాజ్యం వంటి మహనీయ మహిళలు ఈ నేలలో పుట్టి పోరాట స్ఫూర్తిని నాటారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతీ ఉద్యమంలో మహిళలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అనంతరం మహిళలను సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


