నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పాలకుర్తి టౌన్‌: మండలంలోని చెన్నూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి, చెన్నూరు, మైలారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ లావుడ్యా మంజుల, తహసీల్దార్‌ సరస్వతి, ఎండీపీఓ వేదవతి, సర్పంచ్‌లు కారుపోతులు శ్రీనివాస్‌గౌడ్‌, కమ్మగాని విజయ, గుగులోతు విమల, ఏపీఎం వెంకటేశ్వర్లు, బ్లాక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు,గడ్డం యాకసోమయ్య, మాదాసు హరీష్‌, కిషన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement