ప్రతి నెల మూడున్నర కిలోమీటర్లు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. తండాలో 80 మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా ప్రతినెల కిష్టగూడెం వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో వర్షాకాలం వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం.
– ధరావత్ సురేందర్. డీకే తండా వాసి
ఎన్నో ఏళ్ల నుంచి రేషన్ సరుకుల కోసం మా తండా నుంచి టీబీ తండా వద్ద ఉన్న రేషన్ షాపునకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పోవాల్సి వస్తోంది. తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– బాదావత్ రాజు, రేగడి తండా గ్రామ నివాసి


