● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు
రఘునాథపల్లి: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీ వ్రంగా ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఆందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నా రు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేటి నుంచి చేపట్టనున్న లెప్రసీ ఐడెంటిపై సర్వే చేసి లెప్రసీని ఏరాడికెట్ చేయడానికి కృషి చేయాలన్నారు. అలాగే మండలంలోని ఖిలాషాపూర్ ఆరో గ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.రామకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


