సాగునీరు విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

సాగునీరు విడుదల చేయండి

Mar 10 2026 12:46 PM | Updated on Mar 10 2026 12:46 PM

మంత్రి ఉత్తమ్‌కు ఫోన్‌లో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విన్నపం

దేవరుప్పుల: యాసంగి సాగు పంట పరిరక్షణకు సత్వరమే సాగునీటి విడుదల చేయాలని, లేకుంటే రైతుల పక్షాన ఆందోళనలు నిర్వహిస్తామని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. సోమవారం మండలంలోని మాధాపురం శివారు దుబ్బతండా, ధర్మాపురం శివారులో మల్యాతండా, లకావత్‌ తండాలో ఎండిన వరిసాగు పంటలు, ఫెయిలైన బోర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న సాగునీటిని ఎల్‌–4 కాల్వల ద్వారా సకాలంలో అందించని పక్షంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రైతుల గోస విన్న ఎర్రబెల్లి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌లో సమస్యను తెలియజేశారు. రెండు రోజుల్లో ఎల్‌–4 కాల్వ ద్వారా సాగునీరు అందకపోతే చేతికి వచ్చిన పంట సైతం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పల్ల సుందర్‌రామిరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్‌, బస్వ మల్లేశం, సర్పంచ్‌లు లకావత్‌ ఆనంద్‌, చందులాల్‌, చింత రవి, నాయకులు అర్జున్‌, గండిపెల్లి యాకయ్య, బావ్‌సింగ్‌, మోర్‌సింగ్‌, ఉపేందర్‌,లాలునాయక్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement