జఫర్‌గఢ్: ఉపా చట్టం కింద అరెస్టు అయిన సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య మరోసారి షరతులతో కూడిన బెయిల్‌పై తండ్రి సాల్మోన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలకు ఆదివారం హాజరయ్యారు. ఎన్‌ఐఏ కేసులో జైలులో ఉన్న ఇన్నయ్య తన తల్లి థెరిసమ్మతో పాటు తండ్రి సాల్మోన్‌రెడ్డి నెలన్నర రోజుల వ్యవధిలో ఇద్దరు తనువుచాలించడంతో వీరి అంత్యక్రియలకు పోలీస్ భద్రత నడుమ కండీషన్ బెయిల్‌పై హాజరైన విషయం తెలిసిందే. ఇటీవలనే తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్యను కోర్టు ఇచ్చిన గడువు మేరకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా ఆదివారం నుంచి తన తండ్రి దశదినకర్మ కార్యక్రమాలు ఉండడంతో ఈ కార్యక్రమాలకు ఇన్నయ్య హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ కుటుంబ సభ్యులు ఇచ్చిన పిటిషన్ మేరకు మళ్లీ కోర్టు షరతులతో కూడిన 5 రోజుల పాటు బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో తండ్రి దశదిన కార్యక్రమాల్లో ఇన్నయ్య పాల్గొన్నారు.
తండ్రి దిశదినకర్మకు హాజరు


