భూ సేకరణకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణకు చర్యలు తీసుకోవాలి

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

జనగామ రూరల్‌: జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్‌ పనులకు అవసరమైన భూ సేకరణకు చర్యలు తీసుకోవాల ని ఆర్‌అండ్‌ కమిషనర్‌ కె.శివకుమార్‌ నాయుడు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వేల్యాండ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు, రిజర్వాయర్‌ ఇతర ప్రాజెక్టులకు రిక్విజేషన్‌ ఇచ్చిన వాటికి సర్వేలు చేసి పెగ్‌ మార్కింగ్‌ను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ బి. సీతారామ్‌, ఈఈలు, రెవెన్యూ శాఖ అధికారులు, ల్యాండ్‌ అండ్‌ సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. జిల్లాలో జనగణన సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మే 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు జరుగుతుందన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్‌ యాప్‌లు, వెబ్‌ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ నిర్వాహకులు, సీపీఓ చినకోట్యా నాయక్‌, రవి నాయక్‌, హిమ వర్ష, అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌

శివకుమార్‌ నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement