సాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

సాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ప్రత్యేక దృష్టి

Mar 15 2026 1:21 AM | Updated on Mar 15 2026 1:21 AM

జనగామ: జిల్లాలో యాసంగి సీజన్‌లో పంటలకు తగినంత సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ సమావేశం హాలులో పంటల పరిస్థితి, సాగునీటి వినియోగం, విద్యుత్‌ సరఫరా అంశాలపై నీటి పారుదల, ఎన్పీడీసీఎల్‌, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి వనరులు, వినియోగ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించాలన్నారు. సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, నీటిపారుదల ఎస్‌ఈ సీతారాం, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేవు..

జిల్లాలో గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్‌ సందీప్‌ కుమా ర్‌ ఝా తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశం హాలులో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఇతర సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్‌ సరఫరాపై కలెక్టర్‌ గ్యాస్‌ సరఫరా పర్యవేక్షణ కమిటీ (డీఎల్‌ఈఎస్‌ఎంసీ) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్‌ డిమాండ్‌కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద సరిపడా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దు అని చెప్పారు. అక్రమ గ్యాస్‌ తరలింపుపై సమాచారం కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీసీపీ మాట్లాడుతూ.. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపారు. సమీక్షాలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్‌, హసీనా బేగం, విక్రమ్‌, డీఏఓ అంబికా సోనీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, ఇతర సంబంధిత అధికారులు, గ్యాస్‌ డీలర్ల సంఘం అధ్యక్షులు, సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లు,, తది తరులు పాల్గొన్నారు.

గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేవు

సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement