రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Mar 14 2026 7:53 AM | Updated on Mar 14 2026 7:53 AM

పాలకుర్తి టౌన్‌: రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను కూడా అభివృద్ధి చేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పశువైద్యం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అయ్యంగారిపల్లిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రారంభించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. కల్టెకర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ.. పశువైద్యశాఖ అధికారులు గ్రామాల వారీగా టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీ, విజయ డైయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ గోపాల్‌ సింగ్‌, సర్పంచ్‌ ముస్కు సుధాకర్‌, తహసీల్దార్‌ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, పశువైద్యాధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement