స్టేషన్‌ఘన్‌పూర్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్‌డేగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం ఘన్‌పూర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో స్పీకర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలు ఊరుకోరన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య


